Top
logo

సమ్మక్క-సారలమ్మ జాతర తేదీల ఖరారు

సమ్మక్క-సారలమ్మ జాతర తేదీల ఖరారు
X
Highlights

గిరిజన సంప్రదాయాన్ని కళ్లకు కట్టే ఆ పండుగ ''సమ్మక్క-సారలమ్మ జాతర''. మేడారంలో జరిగే ఈ మహా జాతరకు ముహూర్తం ఖరారయ్యింది. 2020 ఫిబ్రవరి 5న సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజు గద్దెలకు చేరుకోనుండగా 2020 ఫిబ్రవరి 6న సమ్మక్క తల్లి గద్దెకు చేరుకోనుంది.

గిరిజన సంప్రదాయాన్ని కళ్లకు కట్టే ఆ పండుగ ''సమ్మక్క-సారలమ్మ జాతర''. మేడారంలో జరిగే ఈ మహా జాతరకు ముహూర్తం ఖరారయ్యింది. సమ్మక్క-సారలమ్మ జాతరను 'తెలంగాణ కుంభమేళా'లా భావిస్తారు. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా జరిపే ఈ జాతరను దేశంలోనే కాకుండా ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగావించింది. ఒక ఏడాది తప్పించి మరో ఏడాది ఘనంగా జరుపుకునే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగునే ఉన్న మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్, ఒడిషా, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు.

ఈ ఏడాది ఏప్రిల్ 21వ తేదీనే మేడారంలోని ఎండోమెంట్ కార్యాలయంలో సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పడిగిద్దరాజుల పూజారులు సమావేశమై జాతర నిర్వహణ తేదీలను ఖరారు చేశారు. 2020 ఫిబ్రవరి 5న సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజు గద్దెలకు చేరుకోనుండగా... 2020 ఫిబ్రవరి 6న సమ్మక్క తల్లి గద్దెకు చేరుకోనుంది. ఫిబ్రవరి 7న భక్తులు మొక్కులు చెల్లించుకోనున్నారు. ఫిబ్రవరి 8న సమ్మక్క-సారలమ్మ తిరిగి వన ప్రవేశం జరగనుంది.

Next Story