మేడారం జాతరలో ఆవిష్కృతమైన కీలక ఘట్టం

మేడారం జాతరలో ఆవిష్కృతమైన కీలక ఘట్టం
x
మేడారం
Highlights

మేడారంలో అద్భుతం ఆవిష్కృతమైంది. భక్తకోటి ఎదురుచూసిన సమ్మక్క గద్దెను అలంకరించింది.

మేడారంలో అద్భుతం ఆవిష్కృతమైంది. భక్తకోటి ఎదురుచూసిన సమ్మక్క.. గద్దెను అలంకరించింది. దీంతో జాతర పరిపూర్ణస్థితికి చేరుకుంది. ఇవాళ్టి రోజు కోసం రెండేళ్లుగా నిరీక్షిస్తున్న భక్తులు.. ఈ ఘట్టంతో పులకించి పోయారు. సమ్మక్క, సారలమ్మను దర్శించుకుని తరిస్తున్నారు. ఇటు రేపు తెలంగాణ సీఎం కేసీఆర్‌.. కుటుంబ సమేతంగా సమ్మక్క, సారాలమ్మను దర్శించుకుంటారు. దీంతో అక్కడ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ఘట్టాన్ని తిలకించేందుకు లక్షల మంది భక్తుల తరలివచ్చారు. గిరిజన యువతుల నృత్యాలు, హిజ్రాల మొక్కులు, శివసత్తుల పూనకాలు, కోయదొరల డోలు వాయిద్యాలు, అధికారుల లాంచనాలు, పోలీసు ఉన్నత అధికారుల తుపాకీ కాల్పుల స్వాగతం పలికారు. కాగా..భారీ పోలీసుల బందోబస్తు మధ్య ఆదివాసీలు, సమ్మక్క పూజారులు, వడ్డెలు వన దేవత సమ్మక్కను మేడారం గద్దెలపైకి చేర్చారు. సమ్మక్క స్వాగత కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ కర్ణన్, ఎమ్మెల్యేలు వీరయ్య, సీతక్క హాజరైయ్యారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories