Medaram Jatara స్పెషల్ బస్సులు: కరీంనగర్ రీజియన్ నుంచి 700 బస్సులు.. ఛార్జీల వివరాలు ఇవే!

Medaram Jatara స్పెషల్ బస్సులు: కరీంనగర్ రీజియన్ నుంచి 700 బస్సులు.. ఛార్జీల వివరాలు ఇవే!
x
Highlights

మేడారం జాతర 2026 కోసం కరీంనగర్ రీజియన్ నుంచి 700 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. మహిళలకు ఉచిత ప్రయాణం ఉండగా, కరీంనగర్, పెద్దపల్లి, గోదావరిఖని ఛార్జీల వివరాలు ఇక్కడ చూడండి.

తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. ఈ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ రీజియన్ నుంచి ఏకంగా 700 ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది.

మహాలక్ష్మి పథకం వర్తిస్తుందా?

మహిళా ప్రయాణికులకు ఒక ముఖ్య గమనిక! ఈ ప్రత్యేక బస్సుల్లో (ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్) కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుంది. అయితే, పురుషులు మరియు పిల్లలకు మాత్రం సాధారణ ఛార్జీల కంటే 50% అదనపు ఛార్జీలు వర్తిస్తాయి.

ఏ ఏ ప్రాంతాల నుంచి ఎన్ని బస్సులు?

కరీంనగర్ రీజియన్ పరిధిలోని ముఖ్య పట్టణాల నుంచి నడిచే బస్సుల వివరాలు:

కరీంనగర్: 140 బస్సులు

పెద్దపల్లి: 175 బస్సులు

మంథని: 170 బస్సులు

గోదావరిఖని: 115 బస్సులు

హుస్నాబాద్ & హుజూరాబాద్: తలో 50 బస్సులు

టికెట్ ధరల వివరాలు (పెద్దలు / పిల్లలు):

జాతర స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు ఈ విధంగా ఉన్నాయి:

ప్రయాణికులకు కీలక సూచనలు:

24 గంటల సేవలు: ఈ ప్రత్యేక బస్సులు జనవరి 27 నుంచి 31 వరకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి.

దగ్గరగా ప్రయాణం: ప్రైవేట్ వాహనాల కంటే ఆర్టీసీ బస్సుల ద్వారా వెళ్తే గద్దలకు అతి దగ్గరగా చేరుకునే అవకాశం ఉంటుంది.

తిరుగు ప్రయాణం: జాతర ముగిశాక భక్తులు తిరిగి వచ్చేందుకు కూడా ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేసింది.

సమ్మక్క-సారలమ్మల దర్శనానికి వెళ్లే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories