కాసేపట్లో ముగియనున్న మేడారం మహా జాతర.. ఇప్పటివరకు కోటీ 20లక్షల మంది భక్తులు..

కాసేపట్లో ముగియనున్న మేడారం మహా జాతర.. ఇప్పటివరకు కోటీ 20లక్షల మంది భక్తులు..
x
కాసేపట్లో ముగియనున్న మేడారం మహా జాతర
Highlights

మేడారం జాతర కాసేపట్లో ముగియనుంది. అధికారులు అనుకున్నట్లే ఈ సంవత్సరం మేడారం జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దారులన్నీ మేడారం వైపు సాగాయి....

మేడారం జాతర కాసేపట్లో ముగియనుంది. అధికారులు అనుకున్నట్లే ఈ సంవత్సరం మేడారం జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దారులన్నీ మేడారం వైపు సాగాయి. తాజా లెక్కల ప్రకారం ఇప్పటికే కోటీ 20 లక్షల మంది వనదేవతల్ని దర్శించుకున్నారు. అక్కడే నాలుగు రోజులుగా ఉండి అమ్మవార్లను కొలుచుకున్నారు. పెద్దఎత్తున భక్తులు మొక్కులు చెల్లించున్నారు. బెల్లాన్ని బంగారంగా భావిస్తూ నిలువెత్తున సమర్పించుకున్నారు.

తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునే మేడారం జాతరలో కాసేపట్లో చివరి ఘట్టం ఆవిష్కృతం కానుంది. నాలుగురోజులపాటు పూజలందుకున్న వన దైవాలు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు తిరిగి తమ వనాలకు వెళ్లిపోబోతున్నారు. అమ్మవార్లను ఘనంగా సాగనంపేందుకు భక్తులు మేడారంలో ఎదురుచూస్తున్నారు.

ప్రపంచ ప్రసిద్ధిచెందిన మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పిస్తామని కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా స్పష్టం చేశారు. మేడారం జాతరకు వచ్చిన అర్జున్ ముండా గద్దెలపై ఉన్న వన దేవతలను దర్శించుకుని, నిలువెత్తు బంగారం సమర్పించారు. అర్జున్ ముండాకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ఘనస్వాగతం పలికారు. మంత్రులు ఆయనకు దగ్గరుండి దర్శనం చేయించారు. దర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన అర్జున్ ముండా దేశ వ్యాప్తంగా ఉన్న గిరిజనులు సమ్మక, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుంటారని తెలిపారు. త్వరలోనే మేడారం మహాజాతరకు జాతీయ గిరిజన పండగ కల సాకారం అవుతోందన్నారు. జాతీయ పండుగ హోదా అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories