మెదక్ జిల్లాలో రోడ్డెక్కిన అన్నదాతలు.. కరెంటు కోతలను నిరసిస్తూ నిరసనలు, రాస్తారోకో...

మెదక్ జిల్లాలో రోడ్డెక్కిన అన్నదాతలు.. కరెంటు కోతలను నిరసిస్తూ నిరసనలు, రాస్తారోకో...
Medak - Farmers: విద్యుత్ కోతలతో చేతికొచ్చిన పంటంతా ఎండిపోతుందని ఆగ్రహం...
Medak - Farmers: మెదక్ జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. కరెంటు కోతల కారణంగా తమ పంటలన్నీ ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాలు, రాస్తారోకోలకు దిగారు. ప్రస్తుతం విద్యుత్తు 10 గంటలు మాత్రమే ఇస్తున్నారని..24 గంటలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధార్మారం విద్యుత్ సబ్‌స్టేషన్ ముందు రైతులు ధర్నా నిర్వహించారు.
గత రెండు రోజులుగా ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకే కరెంట్ ఇస్తున్నారని రైతులు ఆరోపించారు. దీంతో చేతికొస్తున్న వరిపైర్లన్నీ ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామాయంపేట, చేగుంట, నార్సింగి మండలాల్లో అత్యధికంగా బోర్లపై ఆధారపడి పంటలు వేశారు రైతులు. అయితే విద్యుత్తు సరఫరాలో అంతరాయంతో పొలాలు బీటలు వారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని చాలా మండలాల్లో ఇదే పరిస్థితి ఉందని..పంటకు చేసిన అప్పులు ఎలా తీర్చాలని ప్రశ్నిస్తున్నారు. కొందరు ఎండిపోతున్న వరి పంట పొలాల్లోకి పశువులను వదిలేస్తున్నారు. మరికొందరు ట్యాంకర్ల ద్వారా నీటి తడులు అందిస్తూ రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారని వివరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 24 గంటలు విద్యుత్‌ను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
ఒడిశాలో వర్షాలకు పొంగుతున్న నాగావళి నది
20 Aug 2022 2:54 AM GMTవైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ్ ఆత్మహత్య
20 Aug 2022 2:30 AM GMTబిహార్‌లో కన్నీటి పర్యంతమైన గ్రాడ్యుయేట్ ఛాయ్‌వాలీ
20 Aug 2022 2:07 AM GMTబీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
20 Aug 2022 1:43 AM GMTఇవాళ మునుగోడులో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ
20 Aug 2022 1:28 AM GMT