Sukesh Gupta: MBS జ్యువెలర్స్ ఎండీ సుఖేష్ గుప్తా రిమాండ్

MBS Jewellers MD Sukesh Gupta Remanded
x

Sukesh Gupta: MBS జ్యువెలర్స్ ఎండీ సుఖేష్ గుప్తా రిమాండ్

Highlights

Sukesh Gupta: వచ్చే నెల 5వరకు రిమాండ్ విధించిన ఈడీ కోర్టు

Sukesh Gupta: ఎంబీఎస్ జ్యువెలర్స్ ఎండీ సుఖేష్ గుప్తాకు నాంపల్లి ఈడీ కోర్టు వచ్చే నెల 5 వరకు రిమాండ్ విధించింది. మనీ లాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న సుఖేష్ గుప్తాను నిన్న రాత్రి అరెస్టు చేసిన ఈడీ అధికారులు స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. కింగ్ కోఠిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత నాంపల్లిలోని ఈడీ కోర్టులో హాజరుపరిచారు. సుఖేష్ గుప్తాకు 14 రోజులు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ నుంచి ఎంబీఎస్ జ్యువెలర్స్ 2011 వరకు భారీగా బంగారం కొనుగోలు చేసింది. దానికి సంబంధించిన డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో వడ్డీతో కలిపి 503 కోట్ల రూపాయలకు చేరింది. ఎం.ఎం.టీ.సీ అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేయడంతో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. ఈడీ అధికారులు సైతం మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈడీ విచారణలో సుఖేష్ గుప్తా మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు గుర్తించారు. ఎంబీఎస్‌ జ్యువెల్లర్స్ లో వరుస సోదాలు కొనసాగించి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మూడు షోరూముల్లో వంద కోట్లకు పైగా విలువైన బంగారం, వజ్రాలు ఈడీ అధికారులు సీజ్ చేశారు. 50కోట్ల విలువైన బినామీ ప్రాపర్టీస్ స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories