కాసేపట్లో మారుతీరావు అంత్యక్రియలు.. కడసారి తండ్రిని చూసేందుకు వెళ్తానన్న అమృత

కాసేపట్లో మారుతీరావు అంత్యక్రియలు.. కడసారి తండ్రిని చూసేందుకు వెళ్తానన్న అమృత
x
FIle Photo
Highlights

అమృత తండ్రి మృతదేహాన్ని చూసేందుకు తాము అంగీకరించలేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని మారుతీరావు తమ్ముడు శ్రవణ్ తెలిపారు.

అమృతాప్రణయ్‌ తండ్రి మారుతీరావు శనివారం అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం ఆయన హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో విగతజీవిగా కనిపించారు. కాగా, సోమవారం మారుతీరావు అంత్యక్రియలు మిర్యాలగూడలోని హిందూ శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అమృత తండ్రి మృతదేహాన్ని చూసేందుకు తాము అంగీకరించలేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని మారుతీరావు తమ్ముడు శ్రవణ్ తెలిపారు. అమృతను అంత్యక్రియలకు రావొద్దని చెప్పలేదని, ఆయన స్పష్టం చేశారు. దీనిపై మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నట్లు తెలుస్తోంది.

అయితే, తండ్రి మారుతీరావు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అమృత పోలీసులు ఆశ్రయించినట్లు తెలుస్తోంది. కడసారి తండ్రిని చూసేందుకు అమృత భద్రత కోరిందని వార్తలు వస్తున్నాయి. కాగా... ఆమె తల్లి గిరిజ, మారుతీరావు సోదరుడు అమృత బాబాయ్ శ్రావణ్‌ అమృత వచ్చేందుకు నిరాకరించినట్టు తెలిసింది. ఎట్టిపరిస్థితుల్లో తండ్రిని చూసేందుకు అమృతను ఒప్పుకోబోమని బాబాయ్ శ్రావణ్ అన్నట్లు వార్తలు వచ్చాయి. ఇక మారుతీరావు మృతి పట్ల తల్లి, భార్య రోధిస్తున్న తీరు పలువురిని కలచి వేసింది. కూతురిని ఎంతగా ప్రేమించి, ఆమె బాగు కోసమే పరితపించే మారుతీరావు, తనువు చాలించాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

అయితే మారుతీరావు సూసైడ్‌ చేసుకున్న ప్రదేశంలో నోట్ లభ్యమైనట్లు తెలుస్తోంది. తల్లి అమృత నువ్వు అమ్మ దగ్గరికి వెళ్లిపో అంటూ లెటర్ రాసినట్లు ఉంది. వారం రోజుల క్రితమే ఆస్తులన్నీ తన భార్య పేరు మీద రాసినట్లు తెలుస్తోంది.ఉదయం అపస్మారక స్థితిలో పడి ఉన్న మారుతీరావును చూసిన వైశ్య భవన్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

ప్రణయ్‌ను చంపిన పశ్చాత్తాపంతోనే తండ్రి మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అమృత ఆదివారం చెప్పిన విషయం తెలిసిందే. ప్రేమ వివాహం చేసుకున్న కూతురి భర్తను కూడా మారుతీ రావు కోటి సుపారీ ఇచ్చి మరీ ప్రణయ్‌ని హత్య చేయించాడు. సంచలనం సృష్టించిన అమృత భర్త ప్రణయ్‌ హత్య కేసులో నల్లగొండ పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌లో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories