Top
logo

టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ శ్రీనివాస్‌ను హతమార్చిన మావోయిస్టులు

టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ శ్రీనివాస్‌ను హతమార్చిన మావోయిస్టులు
X
Highlights

ఈ నెల 8న కిడ్నాప్ అయిన టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ శ్రీనివాస్‌ను మావోయిస్టులు హతమార్చారు. ఐదు రోజుల క్రితం...

ఈ నెల 8న కిడ్నాప్ అయిన టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ శ్రీనివాస్‌ను మావోయిస్టులు హతమార్చారు. ఐదు రోజుల క్రితం శ్రీనివాస్‌ను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు.. తామే ఆయన్ని హత్య చేసినట్టు ఓ లేఖతో పాటు ఫోటోలను కూడా విడుదల చేశారు. ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని ఎర్రంపాడు-పుట్టాడు రహదారిపై శ్రీనివాస్ మృతదేహం లభ్యమైంది. ఎంపీటీసీ శ్రీనివాస్ పోలీసులతో కలిసి మావోయిస్టు పార్టీ నిర్మూలనకు పని చేస్తున్నారంటూ లేఖలో మావోయిస్టులు ఆరోపించారు. మరోవైపు, మావోయిస్టుల ఘాతుకం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.


Next Story