భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో మావోల దుశ్చ‌ర్య‌

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో మావోల దుశ్చ‌ర్య‌
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. దసరా పండుగ వేళ భద్రాద్రి కొత్తగూడెంలో ఓ హోంగార్డును చంపేసి మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు....

తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. దసరా పండుగ వేళ భద్రాద్రి కొత్తగూడెంలో ఓ హోంగార్డును చంపేసి మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్ నెపంతో అభం శుభం తెలియని ఓ హోంగార్డును మావోలు కొట్టి చంపారు. ఈ ఘటన అనంతరం చెన్నాపురం సమీపంలోని గోరుగొండ దగ్గర మావోలు మృతదేహం వదిలివెళ్లారు. మృతుడు నాయకులపు ఈశ్వర్ ములుగు జిల్లా మల్లంపల్లి వాసిగా స్థానికులు గుర్తించారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటన గురించి ఇప్పటి వరకు అటు పోలీసులు కానీ, ఉన్నతాధికారులు కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

గత కొద్ది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు కదలికలు ఎక్కువగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం మావోల అణచివేతకు పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇదిలా ఉంటే మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ములుగు జిల్లాలో టీఆర్ఎస్ నేతను అతి కిరాతంగా హత్య చేసిన విషయం విదితమే. ఆ సంఘటన జరిగిన నాటి నుంచి ములుగుతో పాటు పలు ప్రాంతాల్లో పోలీసులు, ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories