Maoist Madhukar: కరోనాతో మావోయిస్టు కీలక నేత గడ్డం మధుకర్‌ మృతి

Maoist Madhukar Died Along With Corona
x
కరోనాతో మావోయిస్టు మధుకర్ మృతి (ఫైల్ ఫోటో)
Highlights

Maoist Madhukar: కరోనాతో చికిత్స పొందుతూ మావోయిస్టు నేత గడ్డం మధుకర్ మృతి చెందాడు.

Maoist Madhukar: కరోనా చికిత్స పొందుతూ మావోయిస్టు దండకారణ్య స్పెషల్‌ జోన్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్‌ మృతి చెందాడు. ఈనెల 2వ తేదీన అదుపులోకి తీసుకున్న పోలీసులు కరోనా చికిత్స కోసం నగరంలోని ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున గుండె పోటుతో మృతి చెందినట్లు మధుకర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.

మధుకర్ స్వస్థలం కుమురం భీం జిల్లా బెజ్జూర్ మండలం కొత్తపల్లి గ్రామం. ఇతను 22 ళ్ల కిందట పీపుల్స్ వార్ దళంలో సభ్యుడి గా చేరారు. మొన్న పోలీసులకు చిక్కే వరకూ దండకారణ్య స్పెషల్ జోన్ డివిజన్ కమిటి కార్యదర్శగా ఉన్నాడు.మధుకర్‌పై 8 లక్షల రికార్డు ఉంది. ఈ నెల 2న వరంగల్ శివారులో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా గడ్డం మధుకర్‌తో పాటు కొరియర్‌(మైనర్‌)ను మట్టెవాడ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం చికిత్సకు తరలించారు. దండకారణ్యంలో మరో 12మంది కీలక నేతలకు కరోనా సోకినట్టు పోలీసులకు మధుకర్ వెల్లడించారు.

కాగా కరోనాతో బాధపడుతున్న మావోయిస్టులు చికిత్స చేయించుకోవాలని పోలీసులు పిలుపునిచ్చారు. తమను కలిస్తే దగ్గరనుండి చికిత్స చేయిస్తామని సూచించారు. కొందరు దండకారణ్యంలో చికిత్స పొందుతున్నారని, జనజీవన స్రవంతిలో వచ్చి మెరుగైన చికిత్స పొందాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories