Maoist: చర్లలో మావోయిస్టుల బ్యానర్లు.. మణిపూర్ దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని విజ్ఞప్తి

Maoist Appeal To Fight Against Manipur Attacks
x

Maoist: చర్లలో మావోయిస్టుల బ్యానర్లు.. మణిపూర్ దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని విజ్ఞప్తి

Highlights

Maoist: మహిళా పోరాట దినం జరుపుకోవాలని పిలుపు

Maoist: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టు బ్యానర్లు కరపత్రాలు కలకలం సృష్టిస్తున్నాయి. మావోయిస్టు అనుబంధ ఆదివాసీ విప్లవ మహిళా సంఘం, విప్లవ మహిళా సంఘం పేరుతో ఈ కరపత్రాలు వెలిశాయి. మార్చి 8తేదీన 114వ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం జరుపుకోవాలని అందులో రాసి ఉంది. మణిపూర్ మహిళలపై జరిగిన అవమానీయ దాడులకు, రాజ్యహింసకు వ్యతిరేకంగా పోరాడాలని ఆ పాంప్లెట్‌లో మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు.

పెట్టుబడిదారీ విధానాలను, పితృస్వామిక భావజాలాన్ని పెంచి పోషిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మహిళలపై జరుగుతున్న అన్ని రకాల రాజ్యహింసలకు, హత్యలకు, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడాలంటూ కరపత్రాలలో మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories