Top
logo

CM KCR: సీఎం కేసీఆర్ హస్తీన టూర్‌ వెనుక అసలు మతలబ్‌ ఏంటి ?

Many Doubts Over CM KCR Delhi Tour
X
సీఎం కెసిఆర్ ఢిల్లీ టూర్ వెనుక అసలు రహస్యం ఏంటి (ఫైల్ ఇమేజ్)
Highlights

CM KCR: ఎప్పుడు లేనిది కేసీఆర్‌కు ఇన్ని రోజులు ఢిల్లీలో పనేంటి ?

CM KCR: అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది. సీఎం కేసీఆర్ హస్తీన టూర్‌ వెనుక అసలు మతలబ్‌ ఏంటి.? ఎప్పుడు లేనిది కేసీఆర్‌ ఇన్ని రోజులు ఢిల్లీలో ఎందుకు ఉన్నారు. తెలంగాణను వరదలు ముంచెత్తుతున్నా కేసీఆర్ ఢిల్లీలో ఇన్ని రోజులు ఏం చేశారు. మరోవైపు కేంద్ర మంత్రులు కేసీఆర్‌కు వరుస పెట్టి అపాయింట్‌మెంట్లు ఎందుకు ఇస్తున్నారు. గల్లీలో కుస్తీ పడుతూ ఢిల్లీలో దోస్తీ చేస్తున్నారా.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కలుస్తున్నారా.. లేదంటే ఏమైన రాజకీయ కోణం దాగి ఉందా.. ఇప్పుడివే ప్రశ్నలు అటు రాజకీయనేతలను, రాష్ట్ర ప్రజలను వేధిస్తున్నాయి.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు బీజేపీ రాజకీయ ప్రత్యర్థి అయినా.. కేంద్రంలో కాదనే సంకేతాన్ని కేసీఆర్‌ టూర్‌ ద్వారా అర్థమైపోయింది. మోడీ, అమిత్‌షాల కలుసుకునేందుకు నానాకష్టాలు పడుతూ సుధీర్ఘ నిరీక్షణ చేయాల్సి ఉంటుంది. కానీ కేసీఆర్ పట్ల మాత్రం ఎంతో గౌరవంతో వ్యవహరించారు. జాతీయ స్థాయిలో బీజేపీ బలహీన పడుతున్న టైంలో కేసీఆర్ లాంటి బలమైన నేతలను బీజేపీ మచ్చికచేసుకుంటుంది. భవిష్యత్‌ రాజకీయ అవసరాల కోసమే మోడీ స్నేహ హస్తం అందిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఏం చేశారు. అసలు కారణమెంటో చెప్పేవారే కరువయ్యారు. ఇటు కేసీఆర్‌ కూడా ఈ 9రోజులు మీడియాకు దూరంగా ఉన్నారు.

Web TitleMany Doubts Over CM KCR Delhi Tour
Next Story