Adilabad: అనుమానంతో భార్యను చంపిన భర్త.. పోలీసులకు లొంగిపోదామని వెళ్తుండగా..

Man Murderd His Wife in Adilabad
x

Adilabad: అనుమానంతో భార్యను చంపిన భర్త.. పోలీసులకు లొంగిపోదామని వెళ్తుండగా..

Highlights

Adilabad: బైక్‌పై పారిపోతుండగా లారీని ఢీకొని భర్త మృతి

Adilabad: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బంగారిగూడలో విషాదం చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను చంపిన భర్త.. పోలీసులకు లొంగిపోదామని వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. బంగారిగూడకు చెందిన మోహితే అరుణ్‌.. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండకు చెందిన దీపతో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అదికాస్తా పెద్దదవడంతో దీపను హత్యచేశాడు.

అనంతరం తన బైక్‌పై పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో ఆగిఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అరుణ్‌ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories