TS Assembly: అసెంబ్లీ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న పోలీసులు

Man Commits Suicide In Front Of Assembly
x

TS Assembly: అసెంబ్లీ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న పోలీసులు

Highlights

TS Assembly: ధర్నాలు, దీక్షలు చేసినా ఫలితం లేదని పెట్రోల్‌ పోసుకున్న ఆంజనేయులు

TS Assembly: తెలంగాణ అసెంబ్లీ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. షాబాద్‌ మండలం మాచన్‌పల్లి, మైతాబాద్‌, చందనవెల్లి గ్రామాల్లోని 2వేల ఎకరాల భూసేకరణపై ఆంజనేయులు పోరాటానికి దిగాడు. ప్రభుత్వం భూసేకరణ చేసి పరిహారం ఇవ్వలేదని ఆందోళనకు దిగాడు. 2018 నుంచి ఫిర్యాదు చేస్తున్నా న్యాయం జరగలేదని ఆరోపించాడు. ధర్నాలు, దీక్షలు, చేసినా ఫలితం లేకపోవడంతో మనస్తాపం చెందిన ఆంజనేయులు.. అసెంబ్లీ ఎదుట అందరూ చూస్తుండగానే పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన పోలీసులు.. ఆంజనేయులను అడ్డుకొని.. అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories