Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో విషవాయువు పీల్చి ఒకరి మృతి

Man Cleaning Drainage Pipeline at Hyderabad Airport Dies After Inhaling Toxic Fumes
x

Shamshabad Airport:(File Image) 

Highlights

Shamshabad Airport: శంషాబాద్‌ విమాశ్రయంలో డ్రైనేజీ పైప్ లైను సరిచేస్తుండగా విషవాయువు లీకై ఒకరు మృతి చెందారు.

Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో విషవాయువు పీల్చి ఒకరు మృతిచెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే..శంషాబాద్‌ విమాశ్రయంలో డ్రైనేజీ పైప్ లైన్ లీకైంది. దీంతో పైప్ లైన్ లీకేజీ సరిచేసే పనిని అక్కడి సిబ్బందికి అప్పజెప్పారు. సిందూరి ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌లో పనిచేస్తున్న నర్సింహారెడ్డి, మరో ఇద్దరు లీకేజీని సరిచేసేందుకు ప్రయత్నించారు. డ్రైనేజీ లీకేజీల కోసం తనిఖీలు చేపట్టారు. నిచ్చెన సహాయంతో పైకప్పుకు ఎక్కి, నాళాలను క్లియర్ చేయడానికి.. పైపులో యాసిడ్ పోశారు. ఇలా చేయడంతో.. ఒక్కసారిగా ఘాటైన విషవాయువులతో పాటుగా, పొగలు వచ్చాయి. ఘాటైన పొగ పీల్చి నర్సింహారెడ్డి అనే వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.

దీంతో అధికారులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ నర్సింహారెడ్డి మృతిచెందాడు. నర్సింహారెడ్డితో పనులు చేపట్టిన జాకీర్, ఇలియాస్ క్షేమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories