రాంగ్ రూట్ లో వచ్చి పైగా రివర్సయ్యాడు..

రాంగ్ రూట్ లో వచ్చి పైగా రివర్సయ్యాడు..
x
Highlights

హైదరాబాద్ లో రాంగ్ రూట్ లో వెళ్తున్న వాహనదారుడిని కరెక్ట్ రూట్ లో వెళ్లాలని సూచించినందుకు, హోంగార్డుపై దాడికి దిగాడు. రాంగ్ రూట్ లో వెళ్లడమే కాకుండా...

హైదరాబాద్ లో రాంగ్ రూట్ లో వెళ్తున్న వాహనదారుడిని కరెక్ట్ రూట్ లో వెళ్లాలని సూచించినందుకు, హోంగార్డుపై దాడికి దిగాడు. రాంగ్ రూట్ లో వెళ్లడమే కాకుండా విధి నిర్వహణలో భాగంగా ట్రాఫిక్ రూల్స్ పాటించమని సూచించ హోంగార్డుపై తిట్లదండం అందుకున్నాడు. అక్కడితో ఆగకుండా, అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై డ్యూటీలో ఉన్న హోంగార్డుపై దాడి చేశాడు.

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నీరూస్ చౌరస్తా వద్ద హోంగార్డు మహేష్ విధులు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తున్న సమయంలో ఓ ద్విచక్ర వాహనదారుడు రాంగ్ రూట్ లో రావడాన్ని గమనించాడు. దీంతో బైక్ పై వస్తున్న వ్యక్తిని ఆపి ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా, సరైన రూట్ లో వెళ్లాలని సూచించాడు. దీంతో బైక్ పై నుంచి దిగిన వ్యక్తి హోంగార్డు మహేష్ తో వాగ్వాదానికి దిగాడు.

రాంగ్ రూట్ లో వద్దని సరైన మార్గంలో వెళ్లాలని సూచించిన హోంగార్డుపై వాహనదారుడు రెచ్చిపోయాడు. ఇష్టం ఉంటే ఫోటోలు తీసుకోండి కానీ, నేను మాత్రం రాంగ్ రూట్లనే వెళ్తా అంటూ వాదనకు దిగాడు. మీకు కావలసింది ఫైన్స్ వేసుకోండి అంతేగానీ నేను మాత్రం, రాంగ్ రూట్ లో వెళ్తానంటూ హోంగార్డుపై తిట్లదండకం అందుకున్నాడు. అక్కడే ఉన్న మిగిలిన ట్రాఫిక్ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసిన అతగాడు ఆగకుండా, హోంగార్డుపై దాడికి దిగాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories