కాంగ్రెస్‌ను బలహీనపర్చాలనే కుట్ర జరుగుతోంది : భట్టి విక్రమార్క

X
Highlights
మతపరమైన ఉద్వేగాలు రెచ్చగొట్టి ఎంఐఎం, బీజేపీ లబ్ధిపొందాయని విమర్శించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. గ్రేటర్ ఎన్నికల్లో తమకు ఆశించిన ఫలితాలు రాలేదని తమ బలం, బలహీనతలపై సమీక్షించుకుంటామన్నారు.
admin5 Dec 2020 1:00 PM GMT
మతపరమైన ఉద్వేగాలు రెచ్చగొట్టి ఎంఐఎం, బీజేపీ లబ్ధిపొందాయని విమర్శించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. గ్రేటర్ ఎన్నికల్లో తమకు ఆశించిన ఫలితాలు రాలేదని తమ బలం, బలహీనతలపై సమీక్షించుకుంటామన్నారు. జానారెడ్డి పార్టీ మారే అంశంపై కావాలనే సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. పార్టీని మరింతగా బలహీనపరచాలానే కుట్రతోనే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని భట్టి అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ ఓడినా సిద్ధాంతాలు వీడలేదని అన్నారు. ఇక పీసీసీ చీఫ్ ఎవరనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు బట్టి విక్రమార్క.
Web TitleMallu Bhatti Vikramarka Respond on GHMC Elections Result 2020
Next Story