Telangana Budget 2025-26: రూ.3,04,965 కోట్లతో తెలంగాణ 2025-26 వార్షిక బడ్జెట్.. మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి

Telangana Budget 2025-26: రూ.3,04,965 కోట్లతో   తెలంగాణ 2025-26  వార్షిక బడ్జెట్.. మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి
x
Highlights

Telangana Budget 2025-26: తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 2025-26 వార్షిక బడ్జెట్ ను బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

Telangana Budget 2025-26: తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క 2025-26 వార్షిక బడ్జెట్ ను బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.2025-26 ఆర్ధిక సంవత్సరానికి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ ను ప్రతిపాదించారు. రెవిన్యూ వ్యయం రూ.2,26, 982 కోట్లు, మూలధన వ్యయం రూ.6,504 కోట్లుగా ప్రతిపాదించారు.

గత ఏడాది రూ.2.9 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి జీఎస్‌డీపీ రూ. 16, 1,579 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే వృద్ధి రేటు10.1 శాతంగా నమోదైందని ప్రభుత్వం ప్రకటించింది. ఇదేసమయంలో భారత దేశ జీడీపీ రూ. 3, 31,03,215 కోట్లు. వృద్ది రేటు 9.9 శాతంగా నమోదైంది.2024-25 ఆర్ధిక సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,79,751 గా ఉది. వృద్ధి రేటు 9 శాతం, దేశ తలసరి ఆదాయం రూ.2,05, 579 గా ఉంది. వృద్ధి రేటు 8.8 శాతంగా ఉంది.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే. శాసనమండలిలో రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. బుధవారం ఉదయం అసెంబ్లీలో సమావేశమైన కేబినెట్ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. ఆర్ధిక మంత్రిగా మూడోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు భట్టి విక్రమార్క.

బడ్జెట్ లో కేటాయింపులు

బడ్జెట్ : రూ.3,04,965 కోట్లు

రెవిన్యూ వ్యయం: రూ.2,26, 982 కోట్లు

మూలధన వ్యయం: రూ.6,504 కోట్లు

వ్యవసాయ శాఖ: రూ.24,439 కోట్లు

పశు సంవర్థక శాఖ: రూ.1,674 కోట్లు

పౌరసరఫరాలశాఖ: రూ.5,734కోట్లు

విద్యా రంగం: రూ.23, 108 కోట్లు

కార్మికశాఖ:రూ.900 కోట్లు

పంచాయితీరాజ్ శాఖ: రూ.31,605 కోట్లు

మహిళా శిశుసంక్షేమ శాఖ: రూ.2,862 కోట్లు

ఎస్సీ సంక్షేమం:రూ.40,232 కోట్లు

ఎస్టీ సంక్షేమం: రూ.17,169 కోట్లు

బీసీ సంక్షేమం: రూ.11,405 కోట్లు

చేనేత రంగం: రూ.371 కోట్లు

మైనార్టీ సంక్షేమం:రూ.3,591 కోట్లు

పరిశ్రమల శాఖ:రూ.3,527 కోట్లు

విద్యుత్ రంగం: రూ.21,221 కోట్లు

ఐటీ రంగం:రూ.774 కోట్లు

వైద్య రంగం: రూ.12,393 కోట్లు

మున్సిపల్ శాఖ:రూ.17,677 కోట్లు

నీటిపారుదల శాఖ: రూ.23,373 కోట్లు

రోడ్లు, భవనాల శాఖ:రూ.5,907 కోట్లు

పర్యాటక రంగం: రూ.775 కోట్లు

క్రీడలు :రూ.465 కోట్లు

Show Full Article
Print Article
Next Story
More Stories