ఇవాళ చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన డిక్లరేషన్ సభ.. చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్న మల్లికార్జున ఖర్గే

Mallikarjun Kharge will attend the Dalit and Tribal Declaration Sabha in Chevella Today
x

ఇవాళ చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన డిక్లరేషన్ సభ.. చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్న మల్లికార్జున ఖర్గే

Highlights

Congress: సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ.. ఇప్పటికే రైతు, యువ డిక్లరేషన్లు ప్రకటించిన కాంగ్రెస్

Congress: తెలంగాణలో అధికారమే టార్గెట్‌గా కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. వరుస సభలు సమావేశాలతో క్యాడర్‌లో జోష్ నింపేందుకు ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించింది. ఇందులో భాగంగానే చేవెళ్ల వేదికగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతోంది. అక్కడ జరిగే బహిరంగ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

సభలో ఖర్గే చేత ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ ప్రకటించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ చేసింది. ఇప్పటికే రైతు, యూత్ డిక్లరేషన్ లని ప్రకటించిన కాంగ్రెస్, చేవెళ్ల ప్రజా గర్జన సభ ద్వారా మరింత దూసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వర్గాలను మోసం చేస్తోన్న తీరును సభ ద్వారా ఖర్గేతో చెప్పించనున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళిత, గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి ఎలాంటి చర్యలు చేపడుతుందో అనే దానిపై సభ ద్వారా తెలియజేయనున్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని మించి నూతన సంక్షేమ కార్యక్రమం తేవడంతో పాటు, ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని సభ ద్వారా వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు గిరిజనులకు సంబంధించిన పోడు పట్టాలు, వారిపై వేధింపులు ఇతర అంశాలను ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో పొందుపరచనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories