అనంత్ అంబానీ పెళ్లిల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా మహేశ్ బాబు

Mahesh as a special attraction in Anant Ambani wedding
x

అనంత్ అంబానీ పెళ్లిల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా మహేశ్ 

Highlights

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేశ్ బాబు లుక్

రిలయన్స్ అధినేత ముకేశ్​ అంబానీ చిన్న కూమారుడు అనంత్ పెళ్లి వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ల పెళ్లి వేడుక శుక్రవారం అంగరంగా వైభవంగా జరిగింది. ఇక ఈ వేడుకకు దేశ, విదేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీలను ఆహ్వానించారు.

దీంతో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ కు సెలబ్రిటీలు క్యూ కట్టారు. అయితే టాలీవుడ్ నుంచి విక్టరీ వెంకటేశ్ తో పాటు రామ్ చరణ్– ఉపాసన దంపతులు, అఖిల్ అక్కినేని, సూపర్ స్టార్ మహేశ్ బాబు దంపతులు హాజరై సందడి చేశారు. అయితే ఈ పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు ప్రిన్స్ మహేశ్ బాబు.

భార్య నమ్రత, కుమార్తె సితారలతో కలిసి ఈ వేడుకకు హాజరయిన మహేశ్ బాబు బ్లాక్‍కలర్ ట్రెడిషనల్ ఔట్‍ఫిట్‍లో ఎంట్రీ ఇచ్చారు. షార్ట్ బియర్డ్ లాంగ్ హెయిర్ తో చాలా రోజులకు మరింత హ్యాండ్‍‍సమ్‍గా, కొత్తగా కనిపించాడు సూపర్ స్టార్. దీంతో సోషల్ మీడియా అంతటా నిన్న అనంత్ పెళ్లికంటే మహేశ్ లుక్ పైనే ఎక్కువ చర్చ జరిగింది. చాలామంది అభిమానులు రియాల్ యానిమల్ మహేశ్ బాబు అంటూ కామెంట్లతో నింపేశారు. కొందరూ అయితే అసలు నిజాం కింగ్ మహేశ్ బాబే అంటూ పోస్టులు పెట్టారు. రాజమౌళి సినిమా కోసం మేకోవర్ అవుతున్న లుక్ లోనే ఈ వేడుకకు హాజరవడంతో.. ఫ్యాన్స్, నెటిజన్లు ఆయన ఫొటోలను, వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories