BRS: పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ కసరత్తు

Mahbubabad Parliament Constituency Review Meeting Today
x

BRS: పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ కసరత్తు

Highlights

BRS: ఇవాళ మహబూబాబాద్ పార్లమెంట్‌ నియోజకవర్గ సమీక్షా సమావేశం

BRS: పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ కసరత్తు స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగానే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవాళ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు, నర్సంపేట, డోర్నకల్, మహబూబాబాద్, ఇల్లందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గ నేతలతో కేటీఆర్ భేటీ కానున్నారు. ఈ సమావేశానికి మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరుకానున్నారు.

ఇక అసెంబ్లీ ఎన్ని్కల్లో మహబూబాబాద్ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. ఎస్టీ రిజర్వుడ్ స్థానమైన మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో కేవలం నర్సంపేట మాత్రమే జనరల్ స్థానంలో ఉంది. అయితే మిగతా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వుడు స్థానాలుగా ఉన్నాయి. దీంతో కోయ, లంబాడి ప్రధాన గిరిజన తెగల మధ్య ఈ నియోజకవర్గం పరిధిలో రాజకీయ పోరు సాగుతుందన్న ప్రచారం ఉంది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాలోతు కవిత విజయం సాధించారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్ని్కల్లో మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని నర్సంపేట, డోర్నకల్, మహబూబాబాద్ స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. మిగతా స్థానాలైన ములుగు, భద్రాచలం, ఇల్లందు, పినపాకలో కాంగ్రెస్ విజయం సాధించింది. అనంతరం ఇల్లందు, పినపాక ఎమ్మెల్యేలు గులాబీ పార్టీలో చేరారు.

అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ పరాజయం కావడంతో.. పార్లమెంట్ ఎన్నికల్లో విజయంపై కారు పార్టీ కాన్సన్‌ట్రేట్ చేసింది. ఇక మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత.. ప్రొఫెసర్ సీతారాం నాయక్, శంకర్‌నాయక్ టికెట్ ఆశిస్తున్నారు. అదే సందర్భంలో మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ ఉండనున్నట్లు టాక్. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ కసరత్తులను వేగవంతం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories