Madhu Yaskhi: బీఆర్ఎస్‌కు ఓ గ్యారెంటీ లేదు.. వారంటీ లేదు

Madhu Yaskhi Comments on BRS
x

Madhu Yaskhi: బీఆర్ఎస్‌కు ఓ గ్యారెంటీ లేదు.. వారంటీ లేదు

Highlights

Madhu Yaskhi: తెలంగాణ ఏర్పాటు చేసి చూపిస్తామని చెప్పాం.. చేశాం

Madhu Yaskhi: టీఆర్ఎస్‌కు వారంటీ కతమైందనే బీఆర్‌ఎస్‌ పేరుతో ముందుకు వచ్చారని విమర్శించారు కాంగ్రెస్‌ ప్రచార కార్యదర్శి మధుయాష్కీ. బీఆర్ఎస్‌కు ఓ గ్యారెంటీ లేదు.. వారంటీ లేదంటూ ఆరోపించారు. రాబందుల సమితి బీఆర్‌ఎస్‌ అని విమర్శనాస్త్రాలు సంధించారు. మరో వంద రోజుల్లో బీఆర్‌ఎస్‌ ఖతమవుతుంని, ఆ తర్వాత వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని మధుయాష్కీ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే 6 గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

ఇక.. కాంగ్రెస్‌ 6 గ్యాంరెటీలపై మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించారు మాధుయాష్కీ. తెలంగాణ ఏర్పాటు చేసి చూపిస్తామని చెప్పామని, ఏర్పాటు చేశామని గుర్తుచేశారు ఆయన. అదేవిధంగా ఈ 6 గ్యారెంటీలను కూడా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపించిన మధుయాష్కీ.. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories