తెలంగాణలో రూ.3500 కోట్ల పెట్టుబడులతో లూలూ గ్రూప్ కార్యకలాపాలు

LuLu Group invest Rs 3500 crore in Telangana
x

తెలంగాణలో రూ.3500 కోట్ల పెట్టుబడులతో లూలూ గ్రూప్ కార్యకలాపాలు

Highlights

KTR: ప్రపంచస్థాయి సంస్థలతో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది

KTR: భారత్‌లో లులూ గ్రూప్‌ పెట్టుబడులు పెడుతున్నందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి సంస్థలతో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని అన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని తెలిపారు. త్రివేండ్ రెవల్యూషన్ వై ట్రివల్యూషన్ థింక్ రెవల్యూషన్ ఇలా అన్ని రంగాల్లోనూ తెలంగాణ ముందుందని చెప్పారు. రాష్ట్రంలో ఈ సంస్థ పెట్టబడులతో తెలంగాణ టూరిజం పెరుగుతుందని వెల్లడించారు.

ఏకంగా రాష్ట్రంలో 3వేల 5వందల కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లుగా లూలూ గ్రూప్ యాజమాన్యం తెలిపింది. కేటీఆర్‌ సమక్షంలో పెట్టుబడుల కార్యాచరణ ప్రకటించారు. 300 కోట్లు పెట్టుబడితో హైదరాబాద్‌లో షాపింగ్‌ మాల్‌ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో షాపింగ్‌ మాల్‌ ప్రారంభిస్తాం అని లులూ గ్రూప్‌ ఛైర్మన్‌ యూసఫ్‌ అలీ వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories