అకాల వర్షం - అపార నష్టం

అకాల వర్షం - అపార నష్టం
x
Highlights

తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. పలు జిల్లాల్లో పంటలు నీట మునిగాయి. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి తడిసి ముద్దయింది. పంట...

తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. పలు జిల్లాల్లో పంటలు నీట మునిగాయి. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి తడిసి ముద్దయింది. పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలని రైతులు వేడుకుంటున్నారు. రానున్న 24 గంటల్లో తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

ఛత్తీస్‌గఢ్- తెలంగాణ మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసాయి. మరో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా అకాల వర్షంతో మిర్చికి భారీ నష్టం సంభవించింది. మంగపేట, ఏటూరునాగారం ,వాజేడు మండలాల్లో కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి తడిసిపోయింది. గత పది రోజులుగా వాజేడు మండలం పేరూరు గ్రామంలో గోదావరి ఒడ్డున మిర్చిని రైతులు ఆర పోస్తున్నారు. అకాల వర్షానికి ఒక్కసారిగా నది ఉప్పొంగి ప్రవహించింది. 100 బస్తాలు పైగా మిర్చి నీటిలో నానిపోయింది.

vo:భూపాలపల్లి జిల్లాలో అకాల వానతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం, పలిమెల, మల్హర్ మండలాల్లో పత్తి, మిర్చి పంట దెబ్బతింది. ఆరుగాలం శ్రమించి పండిన పంట నీటి పాలుకావడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఖమ్మం జిల్లాలో అకాల వర్షం రైతును నిండా ముంచింది. కూసుమంచి, తిరుమలయపాలెం, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, ముదిగొండ మండలాల్లో అకాల వర్షం కురిసింది. కళ్లల్లో ఆరబెట్టిన మిర్చి తడిసి ముద్దయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తడిసిన మిర్చిపంటను కొనుగోలు చేయడంతో పాటు నష్టాన్ని చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అకాల వర్షం ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో వరదనీరు పొంగిపొర్లింది. చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరి సమీప పంట పొలాలు నీటి పాలయ్యాయి. విద్యుత్ మోటార్లు నీట మునిగి అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories