Top
logo

తెలంగాణలో మరో ఎన్నికలు నగరా ..15న నోటిఫికేషన్‌

తెలంగాణలో మరో ఎన్నికలు నగరా ..15న నోటిఫికేషన్‌
Highlights

లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడే లోపే తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ...

లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడే లోపే తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ప్రారంభించింది. మండల, జిల్లా పరిషత్‌ల పాలక వర్గాల పదవీ కాలం జూన్‌ 4,5 తేదీల్లో ముగియనున్న నేపథ్యంలో దానికంటే ముందే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సర్వసన్నద్ధమవుతుంది. ఈ క్రమంలో ఈ నెల 15న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకోసం నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 5857 ఎంపీటీసీ స్థానాలు, 535 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి.

ఈ స్థానాలతో పాటు మండల, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవులకు కూడా ఇప్పటికే రిజర్వేషన్లు కూడా ప్రకటించారు. ఇప్పటికే ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం గ్రామీణ ఓటర్ల సంఖ్య కోటీ 56 లక్షలా 11 వేలా 320. ఎన్నికల కోసం మొత్తం 32 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇదిలావుంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే మున్సిపాలిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈలోగా కొత్త మున్సిపాలిటీ చట్టం తీసుకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. మున్సిపల్ శాఖపై ఇటీవల సీఎం కేసీఆర్ సైతం సమీక్ష నిర్వహించినట్టు తెలుస్తోంది.

Next Story