Telangana: ఎల్ఐసి జీఎస్టీ రద్దు చేయాలి: LIAFI సౌత్ సెంట్రల్ జోన్ చెర్మెన్ కె.కాశీనాథ్

Telangana: ఎల్ఐసి జీఎస్టీ రద్దు చేయాలి: LIAFI సౌత్ సెంట్రల్ జోన్ చెర్మెన్ కె.కాశీనాథ్
x
Highlights

భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసి) లో పనిచేస్తున్న ఏజెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఏజెంట్ సమస్యలు పరిష్కరించాలని ఎల్ఐసి కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేశారు.

నారాయణపేట జిల్లా: భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసి) లో పనిచేస్తున్న ఏజెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఏజెంట్ సమస్యలు పరిష్కరించాలని,ఎల్ఐసి పై విధించే జిఎస్టి ని రద్దు చేయాలని నారాయణపేట జిల్లా బ్రాంచ్ కమిటీ అధ్యక్షులు దినేష్ కుమార్ లాహోటి అధ్యక్షతన ఎల్ఐసి కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి ఏజెంట్స్ అసోసియేషన్ సౌత్ సెంట్రల్ జోన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ చైర్మన్ కే కాశీనాథ్, మహబూబ్ నగర్ జిల్లా బ్రాంచ్ కోశాధికారి బసిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దేశంలో ఎల్ఐసి ప్రజలకు నిస్వార్థంగా నిజాయితీగా సేవలను అందిస్తుoదని అదే రకంగా సామాజికంగా సమాజానికి తన చేయూత అందిస్తున్నది.

అనేక కుటుంబాల్లో జీవిత భీమా ద్వారా భద్రత కల్పిస్తున్నదని అలాంటి సంస్థ ను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తుంది. జీఎస్టీ ని ఎల్ఐసి పై రుద్దడం వల్ల భీమా వ్యాపారం రోజురోజుకూ తగ్గి పోతున్నది. ఎల్ఐసి నుండి ప్రతి ఏటా డివిడెండ్ రూపంలో భారత ప్రభుత్వానికి 2650 కోట్ల రూపాయలను అందిస్తున్నది. ప్రతి రూపాయి కి టాక్స్ చెల్లిస్తున్న, ఏకైక సంస్థ ఎల్ఐసి. అదే రకంగా భారత ప్రభుత్వానికి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు , తక్కువ వడ్డీకి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను అమలు పరచడానికి సహాయం అందిస్తుంది. అలాంటి సంస్థ ను క్రమక్రమంగా ప్రైవేటు పరం చేయాలని భావించటం కేంద్ర ప్రభుత్వానికి తగదు. అ

న్ని ప్రభుత్వ రంగాలను పట్టించుకోవాల్సిన బాధ్యత, రక్షించుకోవాల్సిన బాధ్యత భారత పౌరుల పై ఉన్నది. కాబట్టి ఇప్పటికే అనేక రకాల సహాయం భారత ప్రభుత్వానికి చేస్తున్న ఎల్ఐసి.ఇట్టి ఎల్ఐసి పై జిఎస్టి నీ విధించడం సరైన పద్ధతి కాదు వెంటనే రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న మూడు వేల కార్యాలయ ల దగ్గర ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వెంటనే జిఎస్టి రద్దు చేయాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అనంతరం నారాయణపేట్ బ్రాంచ్ మేనేజర్ రామకృష్ణ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో లాలప్ప, ఆనంద్, రాఘవేంద్ర గౌడ్, సత్యనారాయణ గౌడ్, జానీ, నజీర్, జయదేవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories