వ్యవసాయ వర్సిటీ పరిసరాల్లో మరోసారి కనిపించిన చిరుత..

వ్యవసాయ వర్సిటీ పరిసరాల్లో మరోసారి కనిపించిన చిరుత..
x
Leopard (File Photo)
Highlights

గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో చిరుతల సంచారం ఎక్కువ అయిపోయింది.

గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో చిరుతల సంచారం ఎక్కువ అయిపోయింది. నిర్మాణుష్యమైన అటవీ ప్రాంతాన్ని వదిలేసి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఆహారం కోసం పాకల్లో ఉన్న పశువులను బలి తీసుకుంటున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక అటవీ శాక అదికారులు వాటిని పట్టుకుందామని ప్రయత్నం చేసే లోపే అవి చిక్కినట్టే చిక్కి అక్కడి నుంచి జారుకుంటున్నాయి. మళ్లీ ఎప్పుడో కొన్ని రోజుల తరువాత కనిపిస్తున్నాయి.

ఇదే నేపథ్యంలో గత నెల 14వ తేదీన రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌ రైల్వే అండర్‌పాస్‌ వద్ద హల్ చల్ చేసి తప్పించుకున్న చిరుత పులి ఆచూకీ లభించింది. నెల రోజుల నుంచి అటవీశాఖ అధికారులను ముప్పు తిప్పలు పెడుతున్న చిరుత మరోసారి సీసీటీవీ కెమెరాల్లో కనిపించింది. రాజేంద్రనగర్‌లోని జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ పరిసరాల్లో సంచరించినట్లు రికార్డయ్యింది. విశ్వవిద్యాలయ సమీపంలోని నారం ఫామ్‌హౌస్‌లోని ఓ ఇంట్లోకి నిన్న రాత్రి వచ్చిన చిరుత ఆ ఇంటి కిటికీ ఎక్కి లోపలికి తొంగిచూస్తున్నట్లు కెమెరాల్లో నమోదయ్యింది. అది గమనించిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందిచారు. అది ఎప్పుడు తమపై దాడి చేస్తుందో, బయటికి వెళ్లాలంటేనే భయంగా ఉందని, వెంటనే ఆ చిరుతను బంధించాలని స్థానికులు అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.

ఇక ఈ చిరుత మొదట గత నెల 14న రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌ రైల్వే అండర్‌పాస్‌ వద్ద ఉదయం 6 గంటల సమయంలో రోడ్డుపై కనిపింది. అటవీ అధికారులు దాన్ని పట్టకుంటామనే లోపే అది ఓ డ్రైవర్ పై దాడి చేసి అక్కడి నుంచి పక్కనే ఉన్న ఓ తోటలోకి పారిపోయింది. అప్పటి నుంచి ఆ చిరుత వ్యవసాయ యూనివర్సిటీ, పోలీస్‌ అకాడమీ పరిసరాల్లో తిరుగుతున్నది. సరిగ్గా రెండు రోజుల తరువాత అంటే మే 16న హిమాయత్‌ సాగర్‌ వద్ద నీళ్లు తాగుతుండగా స్థానికుగు గుర్తించారు. ఆ తరువాత అధికారులకు సమాచారం అందించారు. మళ్లీ జూన్‌ 3వ తేదీన వ్యవసాయ వర్సిటీ ఆరణలో తిరిగినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. దీంతో అటవీశాఖ అధికారులు చిరుతను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే విధంగా రాష్ట్రంలో మంచిర్యాల, కొమురంభీం జిల్లాల్లో కూడా చిరుతలు సంచరిస్తున్నాయి. ఆకలి మంటకు రాత్రి వేలల్లో పశువులపై దాడి చేసి చంపేస్తున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories