Warangal: సిట్టింగ్‌లకు వణుకు పుట్టిస్తున్న ఆన్‌లైన్‌ సర్వేలు

Leaders Tension Over New survey in Warangal | Off The Record
x

Warangal: సిట్టింగ్‌లకు వణుకు పుట్టిస్తున్న ఆన్‌లైన్‌ సర్వేలు

Highlights

Warangal: ఓరుగల్లులో కొత్త సర్వేపై నేతల్లో దడ

Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పుడు కొత్తగా ఓ పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయిందట. ఆన్‌లైన్ సర్వేలు అంటూ జరుగుతున్న మైండ్‌గేమ్ ఎమ్మెల్యేలకు చెమలు పుట్టిస్తున్నాయట. డిజిటల్ యుగంలో ఎవరికి వారుగా సర్వేలు రిపోర్ట్స్ అంటూ సిట్టింగులకు టెన్షన్ పుట్టిస్తున్నారట. సోషల్‌మీడియా వేదికగా జరుగుతున్న ఈ సర్వేపై ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలు సీరియస్‌గానే నజర్ పెట్టారట. నియోజకవర్గాల్లో తమకు వస్తున్న ఓటింగ్‌పై ఆరా తీస్తున్నారట. ఇంతకూ ఆ ఆన్‌లైన్ సర్వే సారాంశమేంటి? పొలిటికల్‌ హీట్ పెంచుతున్న సర్వేలు ఇస్తున్న నివేదికలు నిజమేనా?

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పుడు ఏ నియోజకవర్గంలో చూసినా మీరు ఓటు వేసే నాయకుడు ఎవరంటూ ఓ కొత్త సర్వే మొదలైందట. ఎన్నికలకు సమయం ఉన్నా ముందస్తు ఎన్నికలపై ఊహగానాలు ఊపందుకోవడం దీనికితోడు పొలిటికల్ హీట్ అదేస్థాయిలో పెరగడంతో తమ పనితీరుపై ఇప్పుడు ఏ చిన్న అంశమైనా నేతలు సీరియస్‌గానే తీసుకుంటున్నారట. దీంతో కొన్ని సంస్థలు ఆయా నియోజకవర్గాల్లో సోషల్ మీడియా సర్వేలు చేపడుతున్నాయి. గతంలో ఇంటింటికీ లేదా ప్రధాన కూడళ్లలో ప్రజల అభిప్రాయాన్ని నేరుగా సేకరించేవారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా హవా విపరీతంగా నడుస్తుండడంతో ఆన్‌లై‌న్ వేదికగా ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తున్నారట.

ఆన్‌లైన్‌లో చేపట్టిన ఈ సర్వేలపై ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సీరియస్‌గా నజర్‌ పెట్టారట. ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారనే అంశాలపై వారు ఆరా తీస్తున్నారట. అంతేకాదు తమ పార్టీ నాయకులను వారివారి గ్రూపుల్లో షేర్ చేసి మనకు ప్లస్ అయ్యేలా చూడాలంటూ సూచిస్తున్నట్లు సమాచారం. తెలిసిన వారందరికీ ఫోన్లు చేసి పాజిటివ్ ఒపీనియన్ ఇచ్చేలా పురమాయించాలని చెబుతున్నారట. పైకి మాత్రం అవి అంతా బోగస్ అంటూ చెబుతూనే ఇంటర్నల్‌గా సర్వేపై సీరియస్‌గా ఫాలోఅప్ చేస్తున్నారట.

సర్వేలు జరువుతున్న సమయంలో ఆయా సర్వే లింకులను నియోజకవర్గానికి సంబంధించిన వాట్సప్ గ్రూపుల్లో లింకులు షేర్ చేస్తూ మీకు నచ్చిన నాయకుడిని సెలెక్ట్ చేసుకోవాలని సూచిస్తున్నారట. అయితే ఆన్‌లైన్ సర్వే కాబట్టి ఎవరైనా ఓటు ఒపీనియన్ ఇవ్వొచ్చు. సర్వేలో పాల్గొనే వారు ఎక్కువ మంది ఎడ్యుకేట్సే కాబట్టి.. వారి నుంచి వచ్చే ఒపీనియన్ రాబోయే ఎన్నికల్లో ప్రభావం చూపుతుందా అనే ఆలోచనలో ఎమ్మెల్యేలు ఉన్నారట.

చదువుకున్న వారిలో వ్యతిరేకత ఉంటే తద్వారా వారి కుటుంబాన్ని, గ్రామాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుందనేది అన్ని పార్టీల నేతల్లో కనిపిస్తున్న ఆందోళన. అందుకే సర్వేను చిన్నచూపు చూడకుండా.. పరిగణనలోకి తీసుకొని లోటుపాట్లను సరిదిద్దుకునే అవకాశంగా భావించొచ్చనే అభిప్రాయంలో ప్రజాప్రతినిధులు ఉన్నారట. వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఈ సర్వే మాయాజాలమేంటంటూ అరా తీశారట. ఒక యాప్ డౌన్‌లోడ్‌ చేసి అందులో ఈ పోల్ నిర్వహిస్తున్నాని గమనించిన ఆ ఎమ్మెల్యే తనకు ఎక్కువ ఓట్లు రావాలని తన ప్రత్యర్థులకు జీరో ఉందాలని చెప్పారట. సంస్థాగతంగా చేసే సర్వేలు ఒకటైతే వివిధ పార్టీలు ఈ సర్వేతో తమకు అనుకూలురకు ఓటు వేసేలా సెటప్ చేసుంటున్నారని ఆ ఎమ్మెల్యే చెప్పారట.

ఇదిలా ఉంటే సర్వే సంస్థలు 'మేక్ యువర్ ఒపీనియన్ నౌ..' అంటూ ఆన్‌లైన్ సర్వే పోల్‌తో ఓరుగల్లు ప్రజాప్రతినిధులకు నిద్రపట్టనివ్వడం లేదు. ఇందులో తాజా ఎమ్మెల్యేల రేటింగ్ దారుణంగా పడిపోవడం మరింత చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగడంతో ఈ సర్వేలు ఎంత వరకు ప్రభావం చూపుతాయో తెలియదు గానీ, ప్రస్తుతం ప్రజాప్రతినిధులను కూర్చోనివ్వకుండా, నిలబడనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయన్నది మాత్రం నిజం. ఆన్‌లైన్ సర్వేలో ప్రస్తుత ఎమ్మెల్యేలపై ప్రజలు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయట. ఓరుగల్లులోని నియోజకవర్గాల్లో సాగుతున్న ఈ సర్వేల్లో పార్టీలకు షాక్ గురయ్యే రిపోర్ట్స్‌ కనిపిస్తోందట. చాలామంది ప్రస్తుత ఎమ్మెల్యేలకు ఓటు వేసేందుకు ఇష్టపడడం లేదట. కొత్తవారికి, ఇతర పార్టీల నేతల వైపు మొగ్గు చూపుతున్నారు.

ఈ సర్వేలు బోగస్ అంటూ కొందరు ఎమ్మెల్యేలు కొట్టిపారేస్తుంటే మరికొందరు సర్వేలను తమకు అనుకూలంగా మార్చుకుని ప్రజల్లో ఓ పాజిటివ్ మెసేజ్ తీసుకుపోయే పనిలో పడ్డారట. కొందరైతే తమ పీఏల్లో కొందరిని ఇదే పని చేయాలంటూ పురమాయిస్తున్నట్లు తెలిసింది. ఏదేమైనా 2023లో మీ ఎమ్మెల్యే ఎవరంటూ సాగుతున్న సర్వే రిపోర్ట్ లో నిజమెంత అనే చర్చ ప్రస్తుతం అటు పొలిటికల్ సర్కిల్లో ఇటు పబ్లిక్‌లోనూ హాట్‌హాట్‌గా జరుగుతోంది. ఎవరు చేస్తున్నారు. ఎలా లెక్కలు పరిగణలోకి తీసుకుంటున్నారనే అంశాలపై ఇప్పటికీ ఎవరికీ సరైన క్లారిటీ లేదు కానీ, సిట్టింగులకు మాత్రం వణుకు పుట్టిస్తున్నాయి. మరి సర్వేల మాయాజాలం ఓరుగల్లు నేతలకు ఓ లెస్సన్‌గా మారుతుందా వారి పనితీరుతో నియోజకవర్గ ప్రజలు సంతృప్తిగా ఉన్నారా ఇది తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories