Telangana: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు లేట్

Late Salaries for Government Employees in Telangana
x

ప్రభుత్వ ఉద్యోగులు (ఫైల్ ఇమేజ్)

Highlights

Telangana: ఒకటి, రెండున రావాల్సిన జీతాలు 10 న వేస్తున్న ప్రభుత్వం

Telangana: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు లేట్ అవుతున్నాయా..? ఆయా డిపార్ట్‌మెంట్‌ల వారీగా ఒకటి లేదా రెండున వచ్చే జీతాలు గత ఆరు నెలలుగా ఆలస్యం అవుతున్నాయా..? అంటే అవుననే అంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రతినెల 10వ తేదీ వరకు జీతాలను విడతల వారీగా వేస్తుంది ప్రభుత్వం. జీతాలు లేట్‌గా రావడంతో ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వేతనాలు లేటు కావడానికి గల కారణాలు ఏంటీ..?

గతంలో ప్రతినెల ఒకటో తేదీన జీతాలు చెల్లించేది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 10 వరకు జీతాలను అకౌంట్‌లో జమా చేస్తుంది. రాష్ట్రప్రభుత్వం పథకాలను రన్ చేయడంతో పాటు కరోనా కాలంలో రాష్ట్ర ఆదాయానికి గండి పడింది. దాదాపు లక్ష కోట్ల వరకు నష్టం రావడంతో జీతాల చెల్లింపు విషయంలో ఆలస్యం అవుతుందంటున్నారు ఆర్ధికశాఖ అధికారులు. దాంతోనే జీతాలను అందరి ఉద్యోగులకు ఒకేసారి కాకుండా విడతల వారీగా అకౌంట్‌లో వేస్తోంది. ప్రభుత్వంలో 32 డిపార్ట్‌మెంట్ లో 3లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2లక్షల మంది పెన్షన్ దారులున్నారు.

గతంలో ఉద్యోగుల బిల్లులను సూపరింటెండెంట్ స్థాయి ఉద్యోగులు రెడీ చేసి ఎన్జీవోలకు సమర్పించేవాళ్లు. కానీ, ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఈ కుబెర్ ద్వారా చెల్లిస్తున్నారు. ప్రస్తుతం ఎన్జీవోలకు అందించిన తర్వాత ఈ కుబెర్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత ఒకటి రెండు జీతాలు అకౌంట్స్‌ వెళ్లాలి. కానీ, ప్రభుత్వం దగ్గర సరిపడిన నిధులు లేక లేట్ అవుతున్నాయని ఉద్యోగులు అంటున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీకున జీతాలు రాకపోవడంతో బ్యాంక్ లోన్స్, ఈఎంఐలు కట్టలేక పోతున్నామని ఆందోళన చెందుతున్నారు. దాంతో ఈ ప్రభావం సీబిల్ స్కోర్ పై పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ ఖజానా ఖాళీ కావడంతోనే గతంలో ఎన్నడూ లేని విధంగా జీతాలు ప్రతి నెల ఆలస్యం అవుతున్నాయి. కరోనా ఎఫెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. జీతాలు రెగ్యులర్‌గా రావడానికి ఎన్ని నెలల సమయం పడుతుందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల సక్రమంగా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories