నేతలు చేజారకుండా అఫిడ‌విట్లు తీసుకుంటున్న టీకాంగ్రెస్

నేతలు చేజారకుండా అఫిడ‌విట్లు తీసుకుంటున్న టీకాంగ్రెస్
x
Highlights

జిల్లా, మండల పరిషత్ ఎన్నకల్లో సత్తా చాటేందుకు వ్యూహ రచన చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్.. ఇందులో భాగంగా గెలిచిన అభ్యర్థులు వేరే పార్టీలలోకి వలస వెళ్లకుండా...

జిల్లా, మండల పరిషత్ ఎన్నకల్లో సత్తా చాటేందుకు వ్యూహ రచన చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్.. ఇందులో భాగంగా గెలిచిన అభ్యర్థులు వేరే పార్టీలలోకి వలస వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్యర్ధుల నుంచి అఫిడ‌విట్ల‌ను తీసుకోవాల‌ని డిసైడ్ అయింది. అందుకోసం పార్టీ ముఖ్యనేతలతో తెలంగాణలో పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల త‌రువాత ప‌ది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించ‌డంతో ఆ అంశాన్ని సీరియస్‌ గా తీసుకుంది పిసిసి. స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో ఆలాంటి ప‌రిస్థితులు పున‌రావృతం కాకుండా ముంద‌స్తు జాగ్రత్తలు తీసుకోవాల‌ని డిసైడ్ అయింది.ఎంపీటీసీ, ఇటు జ‌డ్పీటీసీ అభ్యర్ధులుగా బ‌రిలో నిలిచే వారు ముంద‌స్తుగా పార్టీకి అఫిడ‌విట్లు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయానికి కాంగ్రెస్ వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories