మంత్రి మల్లారెడ్డిపై భూ వివాదం కేసు నమోదు!

మంత్రి మల్లారెడ్డిపై భూ వివాదం కేసు నమోదు!
x
Highlights

తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదయ్యింది. కుత్బుల్లాపూర్ మండలం సూరారంలో తన భూమి కబ్జా చేశారని శ్యామలదేవి అనే మహిళ దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదయ్యింది. కుత్బుల్లాపూర్ మండలం సూరారంలో తన భూమి కబ్జా చేశారని శ్యామలదేవి అనే మహిళ దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి అనుచరులు తనకున్న రెండు ఎకరాల 13 గుంటల భూమిలో 20 గుంటలు కబ్జా చేసి ప్రహరీగోడ నిర్మించారని ఆరోపించారు. మంత్రి ఆదీనంలో ఉన్న భూమిని విడిపించాలంటూ న్యాయవాదిని సంప్రదిస్తే.. ఆయనతో మంత్రి మల్లారెడ్డి కుమ్మక్కై తప్పుడు పత్రాలు సృష్టించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. శ్యామల ఫిర్యాదుతో మంత్రి మల్లారెడ్డి, ఆయన కొడుకుతోపాటు మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories