Komuravelli: కొమురవెల్లిలో అఘోరి హల్‌చల్‌.. కత్తితో భక్తులపైకి

Komuravelli: కొమురవెల్లిలో అఘోరి హల్‌చల్‌.. కత్తితో భక్తులపైకి
x
Highlights

Komuravelli: సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రంలో మంగళవారం అఘోరీ హల్చల్ చేవారు. స్వామివారి దర్శనానికి వచ్చి ఆమె ఆలయ ప్రధాన...

Komuravelli: సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రంలో మంగళవారం అఘోరీ హల్చల్ చేవారు. స్వామివారి దర్శనానికి వచ్చి ఆమె ఆలయ ప్రధాన ద్వారం నుంచి దర్శనం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దిగంబరంగా అనుమతి ఇవ్వలేమని, వస్త్రాలు ధరించి రావాలని ఆలయవర్గాలు సూచించడంతో బయటకు వచ్చి కారులో ఉన్న కత్తి తీసుకుని భక్తులపై దూయడంతో ఒక్కసారిగా వారంతా పరుగులు పెట్టారు.

అక్కడికి పోలీసులు చేరుకుని ఆమెను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. వినకుండా ఆలయ ప్రధాన ద్వారా దగ్గరకు వెళ్లి తలుపులకు ఉన్న తాళాన్ని పగులగొట్టేందుకు యత్నించి విఫలమయ్యారు. వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధిని కత్తితో అడ్డుకోవడంతో సెల్ ఫోన్ పగిలిపోయింది. ఆలయ వర్గాల విజ్ఞప్తితో అఘోర వస్త్రాలు ధరించి వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్లిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories