గుర్తుపెట్టుకోండి.. ఇక రేపటి నుంచి రణరంగమే - భట్టికి కేటీఆర్ వార్నింగ్

KTR Warns Telangana Deputy CM Bhatti Vikramarka and Telangana govt over schemes implementation
x

గుర్తుపెట్టుకోండి.. ఇక రేపటి నుంచి రణరంగమే - భట్టికి కేటీఆర్ వార్నింగ్

Highlights

KTR Warns Telangana govt: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ఉద్దేశించి కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు.

KTR Warns Telangana govt: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ఉద్దేశించి కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ద్వారా ఆయన ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న పథకాలు ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు. మండలానికి ఒక గ్రామంలోనే మీ కాంగ్రెస్ మ్యానిఫెస్టో పంచారా ? మండలానికి ఒక గ్రామంలోనే మీ గ్యారెంటీ కార్డులు ఇచ్చారా అని కేటీఆర్ నిలదీశారు.

మండలానికి ఒక గ్రామంలోనే మీ ఎన్నికల ప్రచారం చేశారా లేక మండలానికి ఒక గ్రామంలోనే ప్రజలను ఓట్లేయమని అడిగారా ? అని ప్రశ్నిస్తూ నాడు "అందరికీ అన్నీ అని చెప్పి నేడు కొందరికే కొన్ని అంటే ఎలా అని అడిగారు.

పథకాల పేరిట ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకం మిమ్మల్ని క్షమించదని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కేటీఆర్ ఇంకా ఏమన్నారంటే...



Show Full Article
Print Article
Next Story
More Stories