KTR Delhi Tour: రేపు ఢిల్లీకి కేటీఆర్‌.. ఎందుకంటే..?

KTR to Delhi Tomorrow
x
Highlights

KTR Delhi Tour: రేపు ఢిల్లీకి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీమంత్రి కేటీఆర్‌ వెళ్లనున్నారు. ఈ నెల 10న సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ జరగనుంది.

KTR Delhi Tour: రేపు ఢిల్లీకి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీమంత్రి కేటీఆర్‌ వెళ్లనున్నారు. ఈ నెల 10న సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో న్యాయవాదులతో ఆయన భేటీకానున్నారు. రెండు, మూడు రోజులు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు కేటీఆర్. ఇక.. కేటీఆర్‌తో పాటు ఢిల్లీకి మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌, దాసోజు శ్రవణ్‌, కొంతమంది నేతలు వెళ్లనున్నారు.

బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు ఫిరాయింపుల చట్టం కింద నోటీసులు ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం శాసనసభ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు నోటీసులు జారీచేశారు. ఈ కేసులో వారిపై అనర్హత వేటు వేసేలా సుప్రీంకోర్టు తీర్పు వస్తుందని కేటీఆర్ ధీమాగా ఉన్నారు. అందుకే బైపోల్స్‌కు సిద్ధంగా ఉండాలని కేడర్‌‌కు పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories