KTR: స‌త్వ‌ర న్యాయం ల‌భించేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి

KTR Support To Civil Court Amendment Bill In Telangana Assembly
x

KTR: స‌త్వ‌ర న్యాయం ల‌భించేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి

Highlights

KTR: అసెంబ్లీలో తామెలాంటి వీడియోలు తీయలేదన్నారు కేటీఆర్.

KTR: అసెంబ్లీలో తామెలాంటి వీడియోలు తీయలేదన్నారు కేటీఆర్. సోషల్‌ మీడియాలో ప్రధాని నుంచి మొదలుకొని సీఎంలు, మాజీ సీఎంలు, ఎమ్మెల్యేలు, స్పీక‌ర్ల మీద వ్యక్తిత్వ హ‌న‌నం చేసే కార్యక్రమం జ‌రుగుతుందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఎవ‌రు అతీతులు కాదని...నెహ్రూ పాల‌న నుంచి ఇప్పటి వ‌ర‌కు జ‌రుగుతూనే ఉందని గుర్తుచేశారాయన. అంద‌రం సోషల్ మీడియా బాధితుల‌మే అని కేటీఆర్ అసెంబ్లీలో తెలిపారు.

సైబర్, లైంగిక నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కోరారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాల వల్ల రాష్ట్రం పోలీసుల రాజ్యంగా మారుతుందేమోననే భయం ప్రజల్లో నెలకొందన్నారు. అటువంటి అపోహలు తొలగించేలా కొత్త చట్టాల్లో కొన్ని విధానపరమైన సవరణలు చేయాలని సూచించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories