గల్లీ ఎన్నికలైనా.. ఢిల్లీ ఎన్నిలైనా టీఆర్‌ఎస్‌కే పట్టం కడుతున్నారు

గల్లీ ఎన్నికలైనా.. ఢిల్లీ ఎన్నిలైనా  టీఆర్‌ఎస్‌కే పట్టం కడుతున్నారు
x
Ktr File Photo
Highlights

తెలంగాణకు కేంద్రం ఒక్కపైసా కూడా ఇవ్వలేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అన్నారు.

తెలంగాణకు కేంద్రం ఒక్కపైసా కూడా ఇవ్వలేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. గల్లీ ఎన్నికైనా.. ఢిల్లీ ఎన్నికైనా ఓటర్లు టీఆర్‌ఎస్‌కే గెలిపిస్తారని అన్నారు. సిద్ధాంతాలకు విరుద్ధంగా కాంగ్రెస్‌, బీజేపీ పొత్తుపై ఆ పార్టీ సినీయర్ నేత వీహెచ్‌ అసహనం వ్యక్తం చేశారని కేటీఆర్ అన్నారు. ఆ రెండు పార్టీలు పొత్తుపెట్టుకోవడంపై ప్రజలు విశ్మయం వ్యక్తం చేశారని అన్నారు. నీతిఆయోగ్‌ సిఫార్సు చేసిన కేంద్రం నిధులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అడ్రస్ లేకుండాపోయాయని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మొదటి స్థానంలో టీఆర్ఎస్ ఉంటే రెండో స్థానంలో టీఆర్ఎస్ ఇండిపెండెంట్లు ఉన్నారని చెప్పారు. దాదాపు 1200 స్థానాల్లో కాంగ్రెస్‌, బీజేపీలకు పోటీ చేసే అభ్యర్థులే కరువైయ్యారని అన్నారు. తెలంగాణ కొత్త పథకాలతో అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు.

కాంగ్రెస్‌పై రాష్ట్ర ప్రజలకు నమ్మకం పోయిందని, బీజేపీ గురించి మాట్లాడకపోవడమే మంచిదని ఎద్దేవా చేశారు. బీజేపీ పార్లమెంట్‌ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాల్లో గెలిచిందని అంతమాత్రనా వారు బలం పెరిగిందని అనుకున్నారని, వారి బలం ఎంతో ప్రజలు గుర్తు చేశారని అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగింది. బీజేపీ నేతలు ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చి తమ సత్తాఎంటో చూపించాలని సవాల్ చేశారు.

ఇటీవలే జరిగిన 120 మున్సిపాలిటీలు, పురపాలికల్లో విజయం సాధించామని, చైర్మన్‌, వైఎస్‌ చైర్మన్‌ల్ల పదవుల్లో మహిళలకు పెద్దపీట వేశామని వెల్లడించారు. ఎక్కవ ‎శాతం బడుగు, బలహీనవర్గాలకే కేటాయించామని గుర్తుచేశారు. శంషాబాద్‌ వరకు మెట్రో రైలు పోడిగిస్తామని కేటీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా శంషాబాద్‌కు చెందిన టీడీపీ కౌన్సిలర్‌ తో పాటు పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories