KTR: వ్యాపార విస్తరణ ప్రణాళికల లిస్ట్ లో తెలంగాణే టాప్

KTR Says Telangana is an Ideal base for investments
x

KTR: వ్యాపార విస్తరణ ప్రణాళికల లిస్ట్ లో తెలంగాణే టాప్

Highlights

KTR: పెట్టుబడులకు తెలంగాణ అనువైన స్థావరం

KTR: ఇండియాలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి తెలంగాణనే ఏకైక గమ్యస్థానం అన్నారు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే.తారకరామారావు. ప్రగతిశీల పారిశ్రామిక విధానాలతో పాటు నూతన ఆవిష్కరణలకు అనువైన వాతావరణం కలిగిన తెలంగాణలో 14 రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్నారు.

కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా మరియు అమెరికా-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ సంయుక్తంగా న్యూయార్క్ లో నిర్వహించిన ఇన్వెస్టర్ రౌండ్ టేబుల్ సమావేశానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. న్యూయార్క్ నగరంతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. తాను ఇక్కడే చదవుకున్నానన్న కేటీఆర్, కొంతకాలం ఉద్యోగం చేశానని చెప్పారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్.. అంతర్జాతీయ దిగ్గజ సంస్థల వ్యాపార విస్తరణ ప్రణాళికల లిస్ట్ లో తెలంగాణే టాప్ గా ఉందన్నారు. అద్భుతమైన హైదరాబాద్ సంస్కృతి, ఆహ్లాదకర వాతావరణం ఎవరినైనా ఆకర్షిస్తుందన్నారు. డైనమిజంతో తెలంగాణ కోసం కేటీఆర్ పనిచేస్తున్నారని రణధీర్ జైస్వాల్ ప్రశంసించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories