KTR: మూసీ నదిపై ఐదు వంతెనల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

KTR Lays Foundation For Construction Of New Bridges Across The Musi River
x

KTR: మూసీ నదిపై ఐదు వంతెనల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

Highlights

KTR: మూసీ,ఈసా నదులపై అందమైన వంతెనలు

KTR: చారిత్రక మూసీ,ఈసా నదులపై అందమైన వంతెనలు అందుబాటులోకి రానున్నాయి. ఐదు వంతెనల నిర్మాణ పనులకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. నగరానికి ఉత్తర, దక్షిణ మార్గాల్లో రాకపోకలకు అనుగుణంగా సరికొత్త డిజైన్లతో బ్రిడ్జిలు నిర్మించేలా HMDA ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ బ్రిడ్జిలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయంతో పాటు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చడంతో పాటు మూసీకి పూర్వవైభవం తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మూసీ, ఈసా నదులపై వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతాప సింగారంతో పాటు ఉప్పల్ భగాయత్ శిల్పారామం, మూసారాంబాగ్ సమీపంలోని మూసీ పరివాహక ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ భూమి పూజచేశారు. 168 కోట్ల రూపాయల వ్యయంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ఐదు బ్రిడ్జిలను నిర్మించనుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా మెరుగుపరచాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మూసీ, ఈసా నదులపై పలు వంతెనలను ప్రతిపాదించింది.

మూసి, ఈసా నదులపై మొత్తం 14 బ్రిడ్జిల నిర్మాణాలను చేపట్టనుండగా.. అందులో ముందుగా ఐదు నిర్మాణాలకు శంకుస్థాపన జరిగింది. మూసీ నదిపై మూడు చోట్ల, ఈసానదిపై రెండు చోట్ల వంతెనల నిర్మాణ పనులను చేపడుతున్నారు. 42కోట్లతో ఉప్పల్ భగాయత్ లే అవుట్ దగ్గర ఒక బ్రిడ్జ్‌ ,35 కోట్లతో ప్రతాపసింగారం- గౌరెల్లి దగ్గర ఒకటి.. 39 కోట్లతో మంచిరేవుల దగ్గర.. 32కోట్లతో బుద్వేల్ ఐటీ పార్క్-2 సమీపంలో ఈసా నదిపై, 20కోట్లతో బుద్వేల్ ఐటీ పార్క్-1 సమీపంలో ఈసా నదిపై HMDA వంతెనలు నిర్మించనుంది. ఇందులో ఉప్పల్ భగాయత్, ప్రతాపసింగారం ప్రాంతాల్లో సుమారు 210 మీటర్ల పొడవున నాలుగు వరుసల వంతెన నిర్మాణం జరుగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories