KTR: కాంగ్రెస్ ఎన్నికల హామీలు ఎగ్గొట్టేందుకే శ్వేతపత్రాల డ్రామాలు

KTR Fire On Congresss
x

KTR: కాంగ్రెస్ ఎన్నికల హామీలు ఎగ్గొట్టేందుకే శ్వేతపత్రాల డ్రామాలు

Highlights

KTR: గ్యారెంటీలను గాలికొదిలేసి…శ్వేతపత్రాలతో గారడీ చేస్తామంటే కుదరదు

KTR: కాంగ్రెస్ ఎన్నికల హమీలు ఎగగొట్టేందుకే శ్వేత పత్రాల డ్రామాలకు తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. గ్యారెంటీలను గాలికొదిలేసి…శ్వేతపత్రాలతో గారడీ చేస్తామంటే కుదరదని.. ప్రచారంలో హామీలను ఊదరగొట్టి..అధికారంలోకి రాగానే మభ్యపెడతారా..? కుంటిసాకులతో పథకాలకు పాతరేస్తారా..? ఏరు దాటిన తర్వాత తెప్ప తగలెయ్యడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని, గద్దెనెక్కినంక వాగ్దానాలను గంగలో కలపడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని.. ట్వి్ట్టర్‌ వేదికగా కాంగ్రెస్‌ను కేటీఆర్ ప్రశ్నించారు. శ్వేత పత్రాల తమాషాలు.. పవర్ పాయింట్ షోలు దేనికోసమని.. ఎన్నికలప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించి అధికార పీఠం దక్కగానే.. మొండిచేయి చూపించడానికి తొండి వేషాలేస్తున్నరన్నారు.

తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రగతి ప్రస్థానం.. తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకమన్నారు. తమ ప్రభుత్వంలో శాసనసభకు సమర్పించిన బడ్జెట్ పత్రాలన్నీ ఆస్తులు..అప్పులు..ఆదాయ వ్యయాలకు శ్వేత పత్రాలే కదా అని కేటీఆర్ అన్నారు. పదేళ్ల తమ ప్రభుత్వ హయాంలో ప్రగతి నివేదికలు ప్రచురించి.. ప్రజల ముందువుంచామని, దాచేది ఏమీలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కొత్తగా.. శోధించి.. సాధించేది ఏమీ ఉండదన్నారు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేరని విమర్శించారు..

కాంగ్రెస్ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి దివాలాకోరు స్టొరీలు చెప్పి...తప్పించుకోవాలని చూస్తున్నదని దుయ్యబట్టారు. నిబద్ధతతో మాట నిలబెట్టుకోవడం..అబద్ధాలు .. అసత్యాలు చెప్పి గెలిచినంత ఈజీ కాదన్నారు. చిత్తశుద్ధి లేనప్పుడు..తప్పించుకునే తప్పుదోవ పట్టించే వంచన బుద్ధిని ప్రదర్శించడం కాంగ్రెస్ కు అలవాటేనని కేటీఆర్ ట్వి్టర్‌లో రాసుకొచ్చారు. కాకిలెక్కలతో కాంగ్రెస్ తప్పించుకోవాలని చూస్తే.. తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం ఖాయమని, హామీలు అమలు చేయలేకపోతే.. అధికార కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ గ్యారెంటీ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories