KTR: 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు.. 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం

KTR Comments On Congress
x

KTR: 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు.. 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం

Highlights

KTR: ఈ వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో.. ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో

KTR: కాంగ్రెస్ పాలనపై ఎక్స్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు కాంగ్రెస్‌ పాలనలో ఆరు నెలల్లోనే ఆవిష్కృతమయ్యాయని కేటీఆర్‌ ట్వీట్ చేశారు. పదేళ్లు కనిపించని కరెంట్ కోతలను చూస్తున్నామని..విద్యుత్తు సబ్ స్టేషన్ల ముట్టడిలను చూస్తున్నామని విమర్శించారు. సాగునీరు లేక ఎండిన పంట పొలాలను చూస్తున్నామన్నారు. -

ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు చూస్తున్నామన్నారు. కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదని, అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదన్నారు. ఈ వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో అని ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు కేటీఆర్.

Show Full Article
Print Article
Next Story
More Stories