KTR: కాంగ్రెస్‌ బస్సుయాత్ర.. తుస్సుమనడం ఖాయం..

KTR Comments on Congress
x

KTR: కాంగ్రెస్‌ బస్సుయాత్ర.. తుస్సుమనడం ఖాయం..

Highlights

KTR: మూడు రోజుల పర్యటన చేసినా.. ముక్కు నేలకు రాసినా ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మరు

KTR: ఎలక్షన్లు రోజురోజుకు దగ్గర పడుతుండటంతో మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు పెంచారు. ఈ క్రమంలోనే తాజాగా రాహుల్ గాంధీ తలపెట్టిన బస్సుయాత్రపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూ.. తెలంగాణలో కాంగ్రెస్ బస్సు యాత్ర తుస్సుమనడం ఖాయం అంటూ జోస్యం చెప్పారు. అలాగే.. సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ అని, చీకటి పాలనకు చిరునామా కర్ణాటక అంటూ విమర్శలు చేశారు.

గత పదేళ్ల కాలంలో..గిరిజన యూనివర్సిటీ పై రాహుల్ ఎందుకు నోరు మెదపలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదని ప్రశ్నించారు. విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్‌కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదని..కర్ణాటకలో ప్రజలకిచ్చిన హామీలన్నీ వంద రోజుల్లోనే బొంద పెట్టిన పార్టీ మీదని కేటీఆర్‌ అన్నారు.

మ్యానిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ప్రభుత్వం మాదని మంత్రి కేటీఆర్ అన్నారు. కర్ణాటకలో రైతులకు ఐదు గంటల కరెంటు కూడా ఇవ్వలేమని చేతులెత్తేసిన చేతకాని దద్దమ్మలు మీరని ఎద్దేవ చేశారు. నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచి తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే నమ్మేదెవరని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మూడు రోజుల పర్యటన చేసినా.. మూడు వందల రోజులు ముక్కు నేలకు రాసినా...తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మరు. వైఫల్యాల కాంగ్రెస్‌ను ఎప్పటికీ విశ్వసించరు..జై తెలంగాణ, జై కేసీఆర్, జై బీఆర్ఎస్ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories