KTR-Harish Rao: ప్రజాప్రతినిధులకు మరోసారి స్ఫూర్తిగా నిలిచిన కేటీఆర్, హరీష్ రావు

KTR And Harish Rao Gave Support To Search Their Vehicles To Police
x

KTR-Harish Rao: ప్రజాప్రతినిధులకు మరోసారి స్ఫూర్తిగా నిలిచిన కేటీఆర్, హరీష్ రావు

Highlights

KTR-Harish Rao: కోడ్ సక్రమంగా అమలయ్యేలా సహకరించిన ఇద్దరు మంత్రులు

KTR-Harish Rao: హరీష్ రావు, కేటీఆర్. ఇద్దరూ తెలంగాణ మంత్రివర్గంలో ముఖ్యమైన మంత్రులు. ఇటు ప్రభుత్వంలో గానీ, అటు బీఆర్ఎస్ పార్టీలో గానీ సీఎం కేసీఆర్ తర్వాత అంతటి కీలకమైన స్థానం వారిదే. ప్రజా సమస్యల పరిష్కారంలో ఉన్నతాధికారులను సైతం ఉరుకులు పరుగులు పెట్టించగల పవర్ ఉన్న ప్రజాప్రతినిధులు. ఉన్న చోటే నిలబడి, కనుసైగతో రాష్ట్రాన్ని శాయించగలరు. అనుకున్న పని చేయించగలరు. కానీ ఏనాడు ఆ అహం, గర్వం ప్రదర్శించరు. చట్టాలను గౌరవించడంలో ముందుంటారు ఈ ఇద్దరు లీడర్లు.

హుందగా వ్యవహరిస్తుంటారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ సజావుగా అమలు అయ్యేలా, తమ వాహనాల తనిఖీకి పూర్తిగా సహకరించి మరోసారి అందరి మెప్పు పొందారు హరీష్ రావు, కేటీఆర్. ఎన్నికల కోడ్‌కు ఎవరూ అతిథిలు కాదని, తోటి ప్రజాప్రతినిధులకు స్ఫూర్తిగా నిలిచారు. తెలంగాణలో కేసీఆర్ తర్వాత అంతటి హై సెక్యూరిటీ కలిగిన ఉన్నా.. కాన్వాయ్‌ను నిలిపి చెక్ చేసుకునేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ అయితేనే కొందరు ఎక్కడ లేని గర్వం ప్రదర్శిస్తారు. తమ కారునే తనిఖీ చేస్తారా,, మీకెంత ధైర్యం అంటూ పోలీసులను దబాయిస్తారు. ఇక ఎమ్మెల్యే అయితే ఆ హడావుడి ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. కానీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు మాత్రం అలా కాదు. ఎన్నికల కోడ్‌ ప్రాధాన్యతను గుర్తించి తనిఖీల విషయంలో పోలీసులకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అధికారులు తమ ఎన్నికల విధులను నిరభ్యంతరంగా చేసుకోవడానికి తోడ్పడ్డారు. తామేంటి, తమ స్థాయి ఏంటి అనే గర్వానికి పోకుండా కారు దిగి మరీ.. వినమ్రతను ప్రదర్శించారు. ఎలక్షన్స్ లో ప్రలోభాలకు తావు లేకుండా, ఓటింగ్ సజావుగా సాగేలా తనిఖీలకు సహకరించారు.

ఎన్నికల్లో క్షణం తీరిక లేకుండా రాష్ట్రాన్ని అంతా చుట్టేస్తూ.. ప్రచారంతో హోరెత్తిస్తున్నారు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. ఐతే ఎన్నికల పర్యటన నేపథ్యంలో కామారెడ్డి వెళ్తున్న మంత్రి కేటీఆర్‌ వాహన కాన్వాయ్‌ను మార్గ మధ్యలో ఆపి వాహనాలను తనిఖీ చేయాలని కోరారు పోలీసులు. ఎందుకు, ఏమిటీ అని అభ్యంతరం చెప్పకుండా.. తనిఖీకి వెంటనే అంగీకరించారు కేటీఆర్. తన కాన్వాయ్‌ను తనిఖీ చేసినంతసేపు కేటీఆర్ కారు దిగి అక్కడే వెయిట్ చేశారు. ప్రలోభాలకు సంబంధించి ఏమీ లేదని తేలడంతో మళ్లీ కాన్వాయ్‌ ఎక్కి.. కామారెడ్డి బయలుదేశారు మంత్రి కేటీఆర్.

ఇక మంత్రి హరీశ్ రావు కాన్వాయ్‌ని సిద్దిపేట జిల్లా పొన్నాల ప్రధాన రహదారి వద్ద ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు మంత్రి హరీశ్ రావు పూర్తిగా సహకరించారు. మంత్రి వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు. మంత్రి అయ్యిండి కూడా పోలీసుల తనిఖీకి సహకరించిన హరీష్‌రావుకి అధికారులు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికోడ్ కోడ్ అందరికి ఒక్కటే అని.. దానికి ఎవరు అతిథిలు కాదని.. తొటి ప్రజాప్రనిధులకు ఆదర్శంగా నిలిచారు కేటీఆర్, హరీష్ రావు.

Show Full Article
Print Article
Next Story
More Stories