Bhadradri Kothagudem: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన కలెక్టర్ భార్య

Bhadradri Kothagudem Collector Anudeep Durishetty Wife Gave Birth to a Baby Boy at the Government Hospital in Bhadrachalam
x

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన కలెక్టర్ భార్య(ఫైల్ ఫోటో)

Highlights

* ప్రాంతీయ ఆస్పత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చిన మాధవి * ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించేందుకు కలెక్టర్ ప్రయత్నం

Bhadradri Kothagudem: ప్రభుత్వ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెంచాలని కొంత మంది అధికారులు, పలువురు రాజకీయ నాయకులు తీవ్రంగా కష్టపడుతున్నారు. కొంత మంది అయితే ప్రభుత్వ వ్యవస్థనే నీరుగార్చేలా వ్యవహరిస్తుంటారు.

అయితే తాజాగా ఓ జిల్లా కలెక్టర్ తన భార్య ప్రసవాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయించాడు. దీంతో పలువురు ఆ కలెక్టర్‌పై ప్రసంసల జల్లు కురిపిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసం పెంచాలనే ఉద్ధేశంతోను ఇలా చేశాడని తెలుస్తోంది.

భద్రచలంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో కలెక్టర్ అనుదీప్ భార్య మాధవి మగ శిశువుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లిబిడ్డలు క్షేమంగా ఉన్నారని ప్రభుత్వ వైద్యులు వెల్లడించారు. కొంతకాలంగా కలెక్టర్ భార్య మాధవి ప్రాంతీయ ఆసుపత్రికి వచ్చి గైనకాలజిస్టుల సలహాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై మరింత నమ్మకం కలిగించేందుకు కలెక్టర్ చేసిన ప్రయత్నం పట్ల పలువురు ప్రశంశిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories