నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీకి ఎంపీ కోమటిరెడ్డి.. కాలేజీ సిబ్బందితో కోమటిరెడ్డి వాగ్వాదం

KomatiReddy VenkatReddy Responded On Satvik Suicide
x

నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీకి ఎంపీ కోమటిరెడ్డి.. కాలేజీ సిబ్బందితో కోమటిరెడ్డి వాగ్వాదం

Highlights

KomatiReddy VenkatReddy: నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదు

KomatiReddy VenkatReddy: హైదరాబాద్ నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీకి వెళ్లారు ఎంపీ కోమటిరెడ్డి. కోమటిరెడ్డిని కాలేజీలోకి అనుమతించకపోవడంతో.. కాలేజీ సిబ్బందితో కోమటిరెడ్డి వాగ్వాదానికి దిగారు. సాత్విక్ మృతిపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరా తీశారు. నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు.

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీకి వెళ్లారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జూనియర్ ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య పట్ల కాలేజీ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాత్విక్ ఆత్మహత్యకు కారణమైన వారిని తక్షణమే అరెస్ట్‌ చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యంను అరెస్టు చేసేంతవరకు ఇక్కడ నుండి కదిలేది లేదు మంచినీరు కూడా తాగేది లేదని స్పష్టం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories