Komatireddy Venkat Reddy: ఇంట్రెస్టింగ్‌గా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ట్వీట్స్

Komatireddy Venkat Reddy Tweet Going Viral On Social Media
x

Komatireddy Venkat Reddy: ఇంట్రెస్టింగ్‌గా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ట్వీట్స్

Highlights

Komatireddy Venkat Reddy: నెట్టింట్లో వైరల్‌గా మారిన కోమటిరెడ్డి వీడియో

Komatireddy Venkat Reddy: తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి నెల రోజులు పూర్తి కావొస్తోంది. అయితే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న వేళ.. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేస్తోన్న ట్వీట్స్ ఆసక్తిని రేకెత్తిస్తోన్నాయి. పార్టీలోని నేతలను పొగుడుతూ చేస్తోన్న ట్వీట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఉన్న ఫొటోను ట్వీట్ చేసిన కోమటిరెడ్డి.. కొత్త శకాన్ని నిర్మిద్దామని అందులో తెలిపారు. ఇక ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డితో నువ్వా నేనా అన్నట్లు వ్యవహరించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

ఇప్పుడు రేవంత్‌రెడ్డి, భట్టి సారథ్యంలో తెలంగాణను ముందుకు తీసుకెళ్తామంటూ పలు సందర్భాల్లో చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే తాజాగా ఆయన చేస్తోన్న ట్వీట్స్.. తామంతా ఐక్యంగా ఉన్నామనే సంకేతాలు ఇస్తూ వస్తున్నారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన ట్విటర్ అకౌంట్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి ఫొటోలతో ఓ బ్యాక్‌రౌండ్ సాంగ్ ఉంది.

అదే రీసెంట్‌గా వచ్చిన సలార్ మూవీలోని వేగమొకడు.. త్యాగమొకడు గతము మరువని గమనమే అంటూ ఈ సాంగ్ సాగుతుంది. లేటెస్ట్‌గా కోమటిరెడ్డి ఆ సాంగ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి, తన ఫొటోలను జతచేసి సరికొత్తగా వీడియో క్రియేట్ చేశారు. ఆ వీడియో ద్వారా రేవంత్‌రెడ్డితో ఉన్న స్నేహాన్ని కోమటిరెడ్డి తెలియజేశారు. ఇప్పుడా వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories