Komatireddy Venkat Reddy: 20 నెలలు అవుతున్నా.. పీసీసీ చీఫ్ ఇప్పటి వరకు మీటింగ్ పెట్టలేదు..

KomatiReddy Venkat Reddy: 20 నెలలు అవుతున్నా.. పీసీసీ చీఫ్ ఇప్పటి వరకు మీటింగ్ పెట్టలేదు

R Tripura Malini
Published on: 20 Dec 2022 4:54 PM IST
KomatiReddy Venkat Reddy Reacts On The Consequences In TCongress
X

టీ కాంగ్రెస్ పరిణామాలపై స్పందించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Komatireddy Venkat Reddy: టీ కాంగ్రెస్ పరిణామాలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. పార్టీలో గ్రూప్‌ వార్‌పై సమన్వయకర్తగా దిగ్విజయ్‌‌సింగ్ నియామకంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఎందుకు ప్రచారం చేయలేదో వివరణ అడగాలని మునుగోడులో సభ పెట్టి తనను తిట్టడంపైనా దిగ్విజయ్ ఆరా తీయాలన్నారు. కాంగ్రెస్‌లో ప్రతి కార్యకర్త పీసీసీ ప్రెసిడెంట్‌కు సమానమేనన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కొన్నిచోట్ల పీసీసీ కమిటీల్లో బలమైన నేతలకు చోటు లేదన్నారు. 20 నెలలు అవుతున్నా పీసీసీ చీఫ్ ఇప్పటి వరకు మీటింగ్ పెట్టలేదన్నారు. ఉదయసముద్రం ప్రాజెక్ట్‌ పూర్తి చేయాలని ఉద్యమిస్తానన్న ఆయన రైతుపాదయాత్ర పేరుతో ఉద్యమం చేయబోతున్నానన్నారు. ఒకవేళ పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్లి తెచ్చుకుంటానని స్పష్టంచేశారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story