ఇవాళ ముఖ్యనేతలతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భేటీ

Komatireddy Raj Gopal Reddy Meet with the Chief leaders today
x

ఇవాళ ముఖ్యనేతలతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భేటీ

Highlights

హైదరాబాద్‌లో మునుగోడు నేతలతో సమావేశం కానున్న రాజగోపాల్‌

Komatireddy Raj Gopal Reddy: ఇవాళ ముఖ్యనేతలతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భేటీ కానున్నారు. హైదరాబాద్‌లో మునుగోడు నేతలతో ఆయన సమావేశం కానున్నారు. గత కొంతకాలంగా బీజేపీ కార్యక్రమాలకు రాజగోపాల్‌రెడ్డి దూరంగా ఉంటున్నారు. బీజేపీ తొలి జాబితాలో రాజగోపాల్‌ పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయైనట్టు సమాచారం. దీంతో.. బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

మునుగోడు టికెట్‌ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ఓకే చెప్పిందన్న గుసగుసలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గతేడాది కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలో చేరారు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. మునుగోడు బహిరంగ సభలో అమిత్‌ షా సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత మునుగోడు బైపోల్‌లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాలకు ఆయన కాస్త దూరంగానే ఉంటూ వచ్చారు. ఎల్లుండి సూర్యాపేటలో అమిత్‌ షా సభ జరగనుంది. ఆ సభకు ముందే బీజేపీని వీడాలనే యోచనలో రాజగోపాల్‌రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories