Kishan Reddy: హైదరాబాద్‌ బీజేపీ ఆఫీస్‌లో కిషన్‌రెడ్డి దీక్ష విరమణ

Kishan Reddy Stopped His Hunger Strike At BJP Office
x

Kishan Reddy: హైదరాబాద్‌ బీజేపీ ఆఫీస్‌లో కిషన్‌రెడ్డి దీక్ష విరమణ

Highlights

Kishan Reddy: నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేసిన ప్రకాష్‌ జవదేకర్‌

Kishan Reddy: తెలంగాణ వచ్చాక పోలీస్ నిర్భందాలతో కేసీఆర్‌ ఉద్యమాలను అణచివేస్తున్నారని మండిపడ్డారు టీబీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి. నియంతృత్వ, నయా నిజాం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని హరించి వేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. తెలంగాణ వచ్చాక ఒక్క టీచర్‌ పోస్ట్‌ భర్తీ చేయలేదని విమర్శించారు. గ్రూప్ - 1 పరీక్ష కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూశారని, ప్రశ్నపత్రం లీక్‌తో వాళ్లంతా ఎంతో బాధ పడ్డారన్నారు. సోనియా, కేసీఆర్ కుటుంబాలు అత్యంత సన్నిహితమని, కాంగ్రెస్ పార్టీని సమర్ధిస్తే.. బీఆర్ఎస్‌ను సమర్థించినట్లేనన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు కిషన్‌రెడ్డి. హైదరాబాద్‌ బీజేపీ ఆఫీస్‌లో నిరుద్యోగుల సమస్యలపై ఒకరోజు దీక్షను విరమించారు కిషన్‌రెడ్డి. ఆయనకు ప్రకాష్‌ జవదేకర్‌ నిమ్మరసం తాగించి దీక్ష విరమింపచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories