మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్‎కు గుణపాఠం చెప్పాలి ‌‌: కిషన్ రెడ్డి

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్‎కు గుణపాఠం చెప్పాలి ‌‌: కిషన్ రెడ్డి
x
Highlights

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకం దురదృష్టవశాత్తు ఇక్కడి టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని మండిపడ్డారు.పురపాలక ఎన్నికల్లో విజయంతో కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలన్నారు.

టీఆర్ఎస్ పై బీజేపీ దాడి కొనసాగిస్తోంది. తెలంగాణలో వచ్చే మున్సిపల్ ఎన్నికలతోపాటుగా, 2023 ఎన్నికల్లోనూ విజయం సాధించాలనే వ్యూహంతో ముందుకెళ్తుంది. అందలో భాగంగా కేసీఆర్‌పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట్ల, ఓవైసీ కుటుంబాల నుంచి తెలంగాణను రక్షించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. బీజేపీ అధ్వర్యంలో కరీంనగర్‌లో శుక్రవారం నిర్వహించిన సేవా వారోత్సవాల కార్యక్రమానికి హాజరైయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కల్వకుంట్ల, ఓవైసీ కుటుంబాల నుంచి తెలంగాణను రక్షించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకం దురదృష్టవశాత్తు ఇక్కడి టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నకల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. పురపాలక ఎన్నికల్లో విజయంతో కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలన్నారు.

కేసీఆర్ నిర్ణయంతో పేదలకు రూ.5 లక్షల వరకు అందాల్సిన మెరుగైన వైద్యం దూరమవుతుందని మంత్రి ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి రావాలని రాష్ట్రంలోని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి పరంగా దిశానిర్దేశం చేస్తున్న మోదీ నాయకత్వాన్ని ప్రపంచ దేశాలు సైతం ప్రశంసిస్తున్నాయని కిషన్ రెడ్డి వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఫలాలు అర్హులైన పేదలకు అందేలా అధికారులు చొరవ చూపాలని అన్నారు. రైతులకు మేలు చేసేలా ఉన్న పథకాలు లబ్ధిదారులకు అందించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ మాట్లాడుతూ.. స్మార్ట్‌ సిటీ పనుల విషయంలో అధికారుల వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు. స్మార్ట్‌సిటీ, గనుల అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టేలా పోరాటాన్ని సాగిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories