Gram Udyog Vikas Yojana: సికింద్రాబాద్లో 600 మందికి గ్రామ ఉద్యోగ మిషనరీ


Under Gram Udyog Vikas Yojana in Secunderabad: సికింద్రాబాద్లో 600 మందికి గ్రామ ఉద్యోగ మిషనరీ
Gram Udyog Vikas Yojana: సికింద్రాబాద్లో గ్రామ ఉద్యోగ వికాస్ యోజన కింద 600 మంది నిరుద్యోగులకు ఆధునిక మిషనరీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి పాల్గొన్నారు.
సికింద్రాబాద్: సికింద్రాబాద్లో గ్రామ ఉద్యోగ వికాస్ యోజన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఖాదీ ఇండియా, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 600 మంది నిరుద్యోగులకు ఆధునిక టెక్నాలజీతో కూడిన మిషనరీలను పంపిణీ చేశారు.
క్లాసిక్ గార్డెన్లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిని ప్రోత్సహించడం, చిన్న స్థాయి పరిశ్రమలను అభివృద్ధి చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. మిషనరీ అందుకున్న ప్రతి లబ్ధిదారు మరో 10 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. ప్రధానమంత్రికి పేరు వస్తుందనే భయంతోనే గతంలో కేసీఆర్, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర పథకాలను సమర్థవంతంగా అమలు చేయలేదని ఆరోపించారు.
గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని, ఖాదీ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని కేంద్రం కట్టుబడి ఉందని కిషన్రెడ్డి స్పష్టం చేశారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



